AK 63: చెన్నైలో ఆఫీస్ ఓపెన్ చేసిన మైత్రీ… అజిత్ సినిమా అనౌన్స్మెంట్ త్వరలో?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత కోలీవుడ్ లో ఆ రేంజ్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో విజయ్ అండ్ అజిత్ టాప్ ప్లేస్ లో ఉంటారు. ముఖ్యంగా అజిత్ కి మాస్ లో ఉన్న ఫాలోయింగ్ కి వేరే ఏ హీరోకి లేదు. స్టార్ ఇమేజ్ అండ్ యాక్టింగ్ స్కిల్స్ కూడా పర్ఫెక్ట్ గా ఉండే ఏకైక కోలీవుడ్ హీరో అజిత్ మాత్రమే. అజిత్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అప్పుడే AK63 సినిమా గురించి చర్చ మొదలుపెట్టారు. AK63 ప్రాజెక్ట్ ని అజిత్ డైరెక్టర్ వెట్రిమారన్ తో చేయనున్నాడు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. వెట్రిమారన్ ని ఇప్పటికే వాడివాసల్, ధనుష్ తో సినిమా, విడుదలై 2 సినిమాలు లైనప్ లో ఉన్నాయి. అజిత్ నెక్స్ట్ సినిమా దర్శకుడు లిస్టులో వెట్రిమారన్, సూపర్ డీలక్స్ డైరెక్టర్ త్యాగరాజన్ కుమార రాజన్ పేర్లు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరినీ పక్కకి నెట్టి ఇంకో దర్శకుడి పేరు వినిపిస్తోంది.
ఇటీవలే విశాల్ తో “మార్క్ ఆంటోని” సినిమా చేసి హిట్ కొట్టిన దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్… నెక్స్ట్ అజిత్ ని డైరెక్ట్ చేయబోతున్నాడని సమాచారం. అజిత్ AK63 ప్రాజెక్ట్ ని ఆధిక్ డైరెక్షన్ లో మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం మైత్రీ మూవీ మేకర్స్ చెన్నైలో ఆఫీస్ కూడా ఓపెన్ చేసారు. త్వరలో మైత్రీ ప్రొడక్షన్ లో AK 63 అఫీషియల్ అనౌన్స్మెంట్ బయటకి రానుంది. అయితే తల అజిత్ అంటూ అభిమానులు ప్రేమగా పిలుచుకునే ఈ హీరో ఏ సినిమా చేసినా, ఏ దర్శకుడితో చేసినా ఆ మూవీ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు. అప్డేట్ ఇవ్వడంలో మేకర్స్ ఏదైనా డిలే చేస్తే మాత్రం సోషల్ మీడియాలో నేషనల్ వైడ్ ట్రెండ్ చేస్తూ చుక్కలు చూపిస్తారు. బోణీ కపూర్ నుంచి లైకా ఎంటర్టైన్మెంట్స్ వరకూ ప్రతి ఒక్కరూ అజిత్ ఫ్యాన్స్ దెబ్బకి సోషల్ మీడియాలో బెబ్బెలెత్తిన వాళ్లే. ఈసారి ఈ లిస్టులో మైత్రీ మూవీ మేకర్స్ ట్రెండ్ అవ్వకుంటే చాలు.
Also Read
తాజావార్తలు
-
Mumbai: సునేత్ర పవార్‌తో ప్రశాంత్ కిషోర్ భేటీ.. మహారాష్ట్రలో కొత్త ఊహాగానాలు
-
Harish Rao : మిషన్ భగీరథకు 10 ఏళ్లు.. హరీశ్ రావు సంబరం..
-
Punjab Politics: పంజాబ్‌లో మళ్లీ బీజేపీ-అకాలీదళ్ పొత్తు..? ప్రధానితో సుఖ్బీర్ భేటీ..
-
Pakistan: ఉద్రిక్తతల వేళ గల్ఫ్ దేశాలతో పాకిస్థాన్ కొత్త కూటమి.. దేనికి సంకేతం!
-
YS Jagan: డీఎస్సీ నిరసనలపై దాడులు దారుణం.. Gen Z గొంతును మూయలేరు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్‌ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!