NTV Telugu Site icon

Mr. Pregnant: నైజాంలో ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ను డెలివర్ చేస్తున్న మైత్రీ మూవీస్

Mr Pregnant Release Date

Mr Pregnant Release Date

Mythri Movie Distributors acquired the Mr Pregnant Nizam theatrical rights: సయ్యద్ సొహైల్ రియాన్, రూప కొడువాయూర్ జంటగా నటిస్తున్న ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా 18న రిలీజ్ కు రెడీ అవుతోంది. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ప్రముఖ పంపిణీ సంస్థ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ సినిమా నైజాంలో విడుదల అవుతొంది. ఈ సినిమా నైజాం హక్కులను మంచి రేట్ కి మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ దక్కించుకుంది. స్థాపించిన తక్కువ కాలంలోనే అనేక హిట్లు కొట్టిన మైత్రీ సంస్థ ద్వారా తమ సినిమా గ్రాండ్ గా విడుదలవుతుండటం ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ టీమ్ లో కొత్త సంతోషాన్ని నింపింది.

Chiranjeevi: సూపర్ స్టార్ హిట్ కొట్టేశాడు.. నెక్స్ట్ నువ్వే బాసూ

మైక్ మూవీస్ బ్యానర్‌లో అప్పి రెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాను నూతన దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి రూపొందిస్తున్నారు. ఇటీవల కింగ్ నాగార్జున చేతుల మీదుగా రిలీజ్ చేసిన ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ ట్రైలర్ కు సూపర్బ్ రెస్పాన్స్ రాగా ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమా మీద ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు. సినిమా నుంచి రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, పాటలు అని మొత్తం ప్రమోషనల్ కంటెంట్ వారి ఆసక్తికి తగినట్లే ఉండడంతో ఆ అంచనాలు మరింత పెడుతున్నాయి. సొహైల్, రూపా కొడువయుర్, సుహాసినీ మణిరత్నం, రాజా రవీంద్ర, బ్రహ్మాజీ, అలీ, హర్ష, స్వప్నిక, అభిషేక్ రెడ్డి బొబ్బల తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి నిజార్ షఫీ సినిమాటోగ్రఫీ శ్రావణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.