My Dear Bootham: మనసు కన్న కలలు చూసెయ్యమన్న ప్రభుదేవా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టార్ డాన్స్ కొరియోగ్రాఫర్, యాక్టర్, డైరెక్టర్ ప్రభుదేవా తాజా చిత్రం ‘మై డియర్ భూతం’. వైవిద్యభరితమైన కథతో అవుట్ అండ్ అవుట్ కిడ్స్ ఫాంటసీ మూవీగా ఇది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Also Read
ఎన్. రాఘవన్ దర్శకత్వంలో రమేష్ పి పిళ్ళై ఎంతో ప్రతిష్టాత్మకంగా దీనిని నిర్మిస్తున్నారు. శ్రీలక్ష్మి జ్యోతి క్రియేషన్స్ అధినేత ఏఎన్ బాలాజీ ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్, అంతకు మించిన నిర్మాణ విలువలతో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కావడంతో ప్రమోషన్స్ వేగవంతం చేశారు. ఇందులో భాగంగా తాజాగా ‘మై డియర్ భూతం’ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
‘మాస్టర్ ఓ మై మాస్టర్..’ అంటూ ఫాస్ట్ బీట్‌తో సాగిపోయే ఈ పాటలో ప్రభుదేవా డాన్స్ హైలైట్ నిలిచింది. ఎప్పటిలాగే స్టైలిష్ స్టెప్స్‌తో ఆకట్టుకున్నారు ప్రభుదేవా. ‘నీ మనసు కన్న కలలు అన్నీ చూసేయ్.. చూసేయ్.. నిన్ను మించినోడు లేనేలేడు ఆడేయ్ పాడేయ్’ సాగే ఈ పాటను డాక్టర్ చల్లా భాగ్యలక్ష్మి రాయగా, అరవింద్ అన్నెస్ట్ గానం చేశారు. రాజేష్, డి. ఇమ్మాన్ కట్టిన బాణీలు ఈ సాంగ్ లెవెల్ ను పెంచేశాయి. పాటకు తగ్గట్టుగా డిఫరెంట్‌గా చూపించిన విజువల్స్ ఆకట్టుకున్నాయి. మొత్తంగా చెప్పాలంటే ఈ సాంగ్ ‘మై డియర్ భూతం’ సినిమాకు మేజర్ అట్రాక్షన్ అవుతుందని స్పష్టమవుతోంది. విడుదలైన కాసేపట్లోనే ఈ సాంగ్ నెట్టింట వైరల్‌గా మారడం విశేషం. ఈ ఫాంటసీ మూవీలో జీనీగా ప్రభుదేవా నటిస్తున్నారు. ఓ మంచి మెసేజ్ ఇస్తూ జీనీకి కిడ్స్‌కి మధ్య జరిగే సన్నివేశాలతో ఈ మూవీ అలరించనుందని, జీనీ పాత్రలో ప్రభుదేవా ఒదిగిపోయారని, ఆయన లుక్ ఎంతో పర్ఫెక్ట్‌గా సెట్ అయిందని, ఈ మేకోవర్ నేచురల్‌గా ఉండేందుకు ఎంత కష్టపడ్డారో రీసెంట్‌గా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కన్ఫర్మ్ చేసిందని తెలుగు నిర్మాత బాలాజీ తెలిపారు. రమ్య నంబీసన్, బిగ్ బాస్ తమిళ్ ఫేమ్ సంయుక్త, ఇమ్మాన్ అన్నాచి, సురేష్ మీనన్, లొల్లు సభా, స్వామినాథన్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.
తాజావార్తలు
-
2027 World Cup: ప్రపంచ కప్‌లో ఆడే టాప్ 6 ఆటగాళ్లు వీరే.. ఆకాశ్ చోప్రా అంచనా ఇలా..
-
Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?