Maruva Tarama: ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్ ఎవర్ గ్రీన్! ఏ తరం యువతనైనా అవి అట్రాక్ట్ చేస్తుంటాయి. ఇక లాంటి సినిమాలను డిఫరెంట్ కంటెంట్ తో తెరకెక్కిస్తే… విజయం ఖాయం. అదే బాటలో ఇప్పుడు మరో ఫీల్ గుడ్ మ్యూజికల్ లవ్ స్టోరీ రాబోతోంది. అదే ‘మరువ తరమా’! అద్వైత్ ధనుంజయ హీరోగా అతుల్యా చంద్ర, అవంతిక నల్వా హీరోయిన్లుగా ఈ సినిమా తెరకెక్కుతోంది. సిల్వర్ స్క్రీన్ పిక్చర్స్ బ్యానర్ మీద గిడుతూరి రమణ మూర్తి, రుద్రరాజు విజయ్ కుమార్ రాజు సంయుక్తంగా దీన్ని నిర్మించారు. ఈ చిత్రానికి చైతన్య వర్మ నడింపల్లి దర్శకత్వం వహించారు.
ఓ వైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చేస్తూనే ప్రమోషన్స్ పై దృష్టి పెట్టింది ‘మరువ తరమా’ చిత్ర యూనిట్. ఇప్పటికే టైటిల్ లుక్ రిలీజ్ చేసి ప్రేక్షకుల మెప్పు పొందింది. ఇదే జోష్ లో తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ప్రేమలో ఉన్న కుర్రాడి ఫీలింగ్స్ తెలిసేలా ఉన్న ఈ పోస్టర్ తొలి చూపులోనే యూత్ ఆడియన్స్ మనసు దోచేసేలా ఉంది. పోస్టర్ లో బ్యాక్ గ్రౌండ్ ఆర్ట్ హైలైట్ గా నిలిచింది. ఈ ఏడాది ప్రేక్షకుల మదిలో ప్రేమను నింపేందుకు ‘మరువ తరమా’ చిత్రం రాబోతోందని మేకర్లు చెబుతున్నారు. త్వరలోనే విడుదల తేదీని, మిగతా వివరాలను ప్రకటించనున్నారు. అలానే ఈ సినిమాలోని తొలి పాటను ఈ నెల 5న రిలీజ్ చేయనున్నట్లు చెప్పారు. విజయ్ బుల్గనిన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి రుద్రసాయి సినిమాటోగ్రాఫర్.