పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన భీమ్లా నాయక్ ట్రైలర్ ఎట్టకేలకు రిలీజ్ అయ్యి రికార్డులు సృష్టినా విషయం తెలిసిందే. అయితే ఈ ట్రైలర్ పై అభిమానులు కాసింత అసహనం వ్ వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా సంగీత దర్శకుడు థమన్ పై ట్రోలింగ్ చేస్తున్నారు. ట్రైలర్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అంత బాలేదని, ఇంకా గట్టిగా కొట్టి ఉంటే ట్రైలర్ ఓ రేంజ్ లో ఉండేదని కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ఈ ట్రోల్స్ పై సంగీత దర్శకుడు థమన్ స్పందించాడు. ” థియేటర్లో ర్యాంప్ అమ్మ.. అన్ని ట్రైలర్ లోనే ఎక్స్ పెక్ట్ చేస్తే ఎలా .. ఫారెస్ట్ ఫైర్ కి లోకల్ ఫైర్ కి తేడా ఉండాలి గా .. ఫిబ్రవరి 25 న థియేటర్లో కలుద్దాం” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక దీంతో పవన్ ఫ్యాన్స్ కొంతవరకు చల్లబడ్డారు. అయినా సరే ట్రైలర్ లో థమన్ మ్యూజిక్ మిస్ అయిందనే చెప్పాలి. ప్రస్తుతం భీమ్లా నాయక్ ట్రైలర్ రికార్డులు సృష్టిస్తున్న విషయం తెల్సిందే.
