Site icon NTV Telugu

Thaman: తమన్ ట్రెండ్ మార్చి అయిదేళ్లు…

Ss Thaman

Ss Thaman

తమన్ పేరు వినగానే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వాళ్లకి మీమ్స్ గుర్తొస్తాయి. మ్యూజిక్ ఎక్కువగా వినే వాళ్లకి డ్రమ్స్ రీసౌండ్ వచ్చే రేంజులో వినిపిస్తాయి. సింపుల్ గా చెప్పాలి అంటే దిస్ వే ఆర్ దత్ వే తమన్ మనకి రోజులో ఎదో ఒక సమయంలో గుర్తొస్తాడు. తమన్ ట్యూన్స్ ని కాపీ చేస్తాడు అనే మీమ్స్ ని చూసి ఎంజాయ్ చేస్తాం, నవ్వుకుంటాం కానీ మన అందరికీ తెలుసు తమన్ సాంగ్స్ ని మనం ఎంజాయ్ చేస్తాం అని, తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని మన అందరం అభిమానులం అని… మణిశర్మ శిష్యుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన తమన్ కెరీర్ స్టార్టింగ్ లో ఎక్కువగా మాస్ సాంగ్స్ నే చేశాడు. డ్రమ్స్ కొట్టాలి అంటే తమన్ తర్వాతే అనే రేంజులో వాయించే వాడు. ఒకానొక సమయంలో తమన్ ఇక డ్రమ్స్ తప్ప వేరేవి వాయించడా? ఇంకా మ్యూజిక్ లో వేరియేషన్స్ చూపించడా అనే కామెంట్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ సమయంలో తమన్ తనని తాను ఆడియన్స్ కి కొత్తగా పరిచయం చేసుకుంటూ ‘తొలిప్రేమ’ సినిమాకి మ్యుజిక్ ఇచ్చాడు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా నటించిన ఈ ఫీల్ గుడ్ లవ్ స్టొరీలో అంత ఫీల్ వర్కౌట్ అయ్యింది అంటే దానికి కారణం తమన్ ఇచ్చిన మ్యూజిక్.

తొలిప్రేమ సినిమాలో ప్రతి సాంగ్ ని బ్యూటిఫుల్ గా కంపోజ్ చేశాడు తమన్. డ్రమ్స్ వాయించే తమన్ లో ఇంత సెన్సిబుల్ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడా అని ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. 2018లో రిలీజ్ అయిన తొలిప్రేమ సినిమాలో సాంగ్స్ మాత్రమే కాదు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సూపర్బ్ గా ఉంటుంది. నిన్నిలా నిన్నిలా సాంగ్, తొలిప్రేమ టైటిల్ సాంగ్, హీరో-హీరోయిన్ విడిపోయే సీన్ ఇలా చెప్పుకుంటూ పోతే తొలిప్రేమ ఒక మ్యూజిక్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు. తమన్ అంత అద్భుతంగా మ్యూజిక్ ఇచ్చి అయిదేళ్లు అయ్యింది. 2018 నుంచి తమన్ సూపర్బ్ ఫామ్ లో ఉన్నాడు. ఏ సినిమాకి తమన్ మ్యూజిక్ చేసినా అది ఆ సినిమాకి రాక్ సాలిడ్ గా హెల్ప్ అవుతుంది. 2018లోనే తమన్ ‘భాగమతి’, ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమాలకి కూడా మ్యూజిక్ చేశాడు. తమన్ 100వ సినిమా అయిన అరవింద సమేత మూవీకి తమన్ ఇచ్చిన మ్యూజిక్ బిగ్గెస్ట్ ఎస్సెట్ గా నిలిచింది. ప్రస్తుతం టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా కెరీర్ పీక్స్ చూస్తున్న తమన్, త్రివిక్రమ్ తో కలిసి మహేశ్ బాబు సినిమాకి మ్యూజిక్ ఇస్తున్నాడు. ఈ మూవీతో తమన్ పాన్ ఇండియా ఆడియన్స్ కి రీచ్ అవుతాడేమో చూడాలి.

Exit mobile version