Site icon NTV Telugu

Thaman: నిన్ను చూస్తుంటే తప్పుగా అనుకుంటారు… గీతా మాధురికి తమన్ పంచ్

Thaman

Thaman

మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కి సోషల్ మీడియాలో ఉండే క్రేజ్ మరో ఇతర మ్యూజిక్ డైరెక్టర్ కి ఉండదు. స్టార్ యాక్టర్స్ తో సమానంగా సోషల్ మీడియాలో తమన్ పేరు వినిపిస్తూ ఉంటుంది. మీమ్స్, ట్రోల్ వీడియోస్, ఫన్ వీడియోస్… ఇలా తమన్ సినిమా ఫంక్షన్ లో మాట్లాడినా, క్రికెట్ ఆడినా, బయట ఎక్కడైనా కనిపించినా అది సోషల్ మీడియాలో గ్యారెంటీగా ట్రెండ్ అవుతూ ఉంటుంది. లేటెస్ట్ గా ఇలాంటి వీడియోనే ఒకటి బయటకి వచ్చింది. తమన్ ప్రస్తుతం ఆహా ప్లాట్ ఫామ్ లో జరుగుతున్న ‘తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2’కి జడ్జ్ గా వ్యవహరిస్తున్నాడు. సీజన్ 1 సూపర్ హిట్ అవ్వడంతో, ఆ సీజన్ కి జడ్జ్ గా చేసిన తమన్ తన ఫన్ టైమింగ్ తో అందరినీ నవ్వించాడు. ఇప్పుడు సీజన్ 2 స్టార్ట్ అవ్వకముందే తన కామెడీ టైమింగ్ తో అందరినీ నవ్వించేసాడు. తమన్ తో పాటు గీత మాధురి, సింగర్ కార్తీక్ కూడా ఈ సింగింగ్ షోకి జడ్జ్ లుగా వ్యవహరిస్తున్నారు. హేమచంద్ర హోస్ట్ గా  తెలుగు ఇండియన్ ఐడల్ ప్రోమో సాంగ్ ని షో రన్నర్స్ లాంచ్ చేశారు.

ఈ సందర్భంగా ఒక ఈవెంట్ లో గీత మాధురి, తమన్ గురించి మాట్లాడుతూ “తమన్ సర్ కి మంచి మనసు ఉంది, అందుకే ఆయన అంత మంచిగా మాట్లాడుతూ ఉంటారు. ఆయన నిజంగా మంచి వారు” అంటూ చెప్పింది. గీత మాధురి మాట్లాడుతున్న సమయంలో తమన్, ఎక్కడో చూస్తూ నిలబడ్డాడు. దీంతో గీతా మాధురి, నేను మీ గురించి మాట్లాడుతుంటే మీరు ఎక్కడో చూస్తున్నారు ఏంటి సర్ అని అడిగింది. దీనికి సమాధానంగా తమన్ “కెమెరా వైపే చూడాలి కదా, నీ సైడ్ చూస్తే వాళ్లు తప్పుగా అనుకుంటారు” అంటూ సూపర్బ్ పంచ్ వేసి అక్కడ ఉన్న అందరినీ నవ్వించాడు. తమన్, గీత మాధురికి వేసిన పంచ్ వీడియో ఇప్పుడు ఇన్స్టా, ట్విట్టర్ లో ట్రెండ్ అవుతోంది. మరి ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 స్టార్ట్ అయితే తమన్ ఇంకెంత ఫన్ ఇస్తాడో చూడాలి.

https://twitter.com/reddy_aria/status/1628268689551405056?t=eYUh4gm1qdGpQdKE6hSM7g&s=19

https://www.youtube.com/watch?v=2DoGylOR288

Exit mobile version