NTV Telugu Site icon

SS.Thaman: ఇక్కడ ఏ గొట్టంగాడికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు..

Thaman

Thaman

SS.Thaman: చిత్ర పరిశ్రమ.. ఎన్ని ప్రశంసలను అయితే ఇస్తుందో.. అంతే విమర్శలను అందిస్తుంది. ఒక సినిమా బావుంటే ఆకాశానికి ఎత్తినవారే.. మరో సినిమా బాగోలేకపోతే అధఃపాతాళానికి తొక్కేస్తారు. ఇక్కడ పరిస్థితులు ఎప్పుడు ఎలా మారతాయో చెప్పడం చాలా కష్టం. ప్రస్తుతం స్టార్ హీరోయిన్లే కాదు.. హీరోలు, మ్యూజిక్ డైరెక్టర్లు సైతం ట్రోల్స్ కు గురవుతున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ పై వస్తున్న ట్రోల్స్ అయితే మరీ దారుణంగా ఉంటున్నాయి. మొదటి నుంచి కూడా థమన్ పై ట్రోలింగ్ ఎక్కువగానే ఉంటుంది. కాపీ ట్యూన్స్ వాడతాడని, ఒకేలాంటి మ్యూజిక్ ఇస్తాడని ఇష్టంవచ్చినట్లు ట్రోల్ చేసేవారు. ఇక మంచి సాంగ్స్ ఇచ్చినప్పుడు థమన్ ను కొట్టేవారు లేరని చెప్పుకొచ్చేవారు. అయితే ఈ ట్రోలింగ్ ఇలా కొనసాగుతుంది కానీ, ఎక్కడా ఆగిన దాఖలాలు మాత్రం లేవు. ఎన్నోసార్లు ఈ ట్రోలింగ్ పై థమన్ స్పందించాడు. అసలు అలాంటి ట్రోలింగ్ ను తాను పట్టించుకోనని చెప్పుకొచ్చాడు. అయితే బ్రో సినిమాకు మాత్రం అభిమానులు థమన్ పై మరో నిందను వేశారు. థమన్.. క్రికెట్ పై చూపే శ్రద్ద మ్యూజిక్ పై చూపించడం లేదని చెప్పుకొచ్చారు. మొదటినుంచి కూడా థమన్ కు క్రికెట్ అంటే పిచ్చి. స్టేడియంలోకి దిగాడంటే సచిన్ లా దుమ్ముదులిపేయాల్సిందే. నిత్యం క్రికెట్ పిచ్చిలో పడి మ్యూజిక్ ను పక్కన పడేశాడని, అందుకే ఇంత చెత్త ట్యూన్స్ ను ఇస్తున్నాడని ట్రోలర్స్ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అయితే తాజాగా ఈ ట్రోల్స్ పై థమన్ స్పందించాడు.

Hayley Atwell: టామ్ క్రూజ్ తో శృంగారం.. చాలా చెత్తగా ఉంది

“నేను మందు కొట్టను, నాకు గర్ల్ ఫ్రెండ్స్ లేరు.. ఎలాంటి వ్యాపకాలు లేవు.. నాకున్న ఒకే ఒక్క ఎమోషన్ క్రికెట్. రాత్రి 9 గంటలకు.. అందరూ పడుకున్నప్పుడు వెళ్లి క్రికెట్ ఆడటం. మా టీమ్ మొత్తం 22 మంది ఉన్నాం.. మా టీమ్ పేరు థమన్ హిట్టర్స్. సాఫ్ట్ వేర్ కంపెనీస్ తో కానీ, పోలీస్ కమీషనర్ టీమ్స్ తో కానీ ఆడుతూ ఉంటాం. మేము రోజు రాత్రి మ్యాచ్ ఆడుతాం. ఇది నా ఎక్సర్ సైజ్.. నా ఎమోషన్. ఇది ఎవడికి నేను జవాబు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నేను ఎందుకు చెప్పుకోవాలి. నా పని వదిలేసి నేను వెళ్లడం లేదు. రోజూ రాత్రి 9 గంటలకు మ్యాచ్ కు వెళ్లి 2 గంటలకు ఇంటికి వచ్చి, చక్కగా వేడినీళ్లతో స్నానం చేసి పడుకుంటాను. ఇది నా హెల్త్ కు ముఖ్యం.. నా స్ట్రెస్ బస్టర్. దీన్ని కూడా తప్పుగా చూస్తుంటే నాకు బాధగా ఉంది. తెల్సినవాళ్ళే ఇలా తప్పుగా రాస్తున్నారు.. అది చాలా బాధగా ఉంది. ఇదిగో థమన్.. నువ్వు పని ఆపేశావ్ అని ఇంతవరకు నాపై ఒక్క డైరెక్టర్ కంప్లైంట్ చేయలేదు.. ఒక్క నిర్మాత కూడా నాపై కంప్లైంట్ చేయలేదు.. నేను మ్యూజిక్ పై ఎంత శ్రద్ద పెడతాను.. నాకొచ్చే రెమ్యూనిరేషన్ లో ఎంత ఖర్చు పెడతాను అనేది వారికి కూడా తెలుసు. ఇక్కడ, నేను ఏ గొట్టం నా కొడుక్కి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. క్రికెట్ అనేది నా ఎమోషన్.. ఒకడు మందు కొడతాడు.. ఇంకొకడు డ్యాన్స్ చేస్తాడు.. అలాగే నేను క్రికెట్ ఆడతాను” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఏ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.