NTV Telugu Site icon

Adipurush: ‘ఆదిపురుష్’ కోసం మీ సాహసం.. గుర్తుండిపోతారయ్యా

Ajay

Ajay

Adipurush: ఆదిపురుష్.. ప్రభాస్.. జై శ్రీరామ్.. ఓం రౌత్.. ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం ఈ పేర్లతో నిండిపోయిందని చెప్పాలి. ఆదిపురుష్ చిత్రంతో ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. జూన్ 16 న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో రిలీజ్ కానుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మొదటి నుంచి ఒక నెగెటివ్ వైబ్ తో, వివాదాల మధ్య నలుగుతున్న ఆదిపురుష్ కు ట్రైలర్ రిలీజ్ తో కొద్దిగా పాజిటివిటీ పెరిగింది. ఇక ఆ పాజిటివీటినే మేకర్స్ కంటిన్యూ చేస్తున్నారు. ఇక జూన్ 5 న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో ప్లాన్ చేసి మరింత మెప్పించారు. ఈ వెంత్ కు దర్శకధీరుడు రాజమౌళి ముఖ్య అతిథిగా విచ్చేస్తుండగా.. పలువురు రాజకీయ నేతలు కూడా హాజరుకానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అజయ్- అతుల్ ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమా నుంచి రెండు పాటలు రిలీజ్ అయిన దగ్గరనుంచి టాలీవుడ్ మొత్తం.. అతుల్ కు ఫ్యాన్స్ గా మారిపోయారు. జై శ్రీరామ్, రామ్ సీతారామ్ సాంగ్స్ కు అజయ్- అతుల్ ఇచ్చిన మ్యూజిక్ అద్భుతమని ప్రశంసలు కురిపించిన విషయం తెల్సిందే.

Raashi Khanna: అద్దం ముందు అమ్మడి ఎద అందాల ఆరబోత.. హీటెక్కిస్తోందే

ఇక తాజాగా అజయ్- అతుల్.. ఈ సినిమా ప్రమోషన్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లే ప్లాన్ వేశారు. జూన్ 4 న తిరుపతిలో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు బైక్ పై వస్తున్నట్టు ప్రకటించారు. అంటే తిరుపతి వచ్చాకా ఈవెంట్ కు బైక్ పై రావడం కాదు.. ముంబై నుంచి తిరుపతికి బైక్ ర్యాలీగా వస్తున్నార ట. జూన్ 3 న .. అంటే ఈరోజు ముంబైలో బైక్ పై బయల్దేరి.. రోడ్డు మ్యాప్ ద్వారా తిరుపతి చేరుకోనున్నారు. ఇక తిరుపతి చేరుకోగానే..తన సోదరుడు అజయ్‌తో కలిసి ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో లార్డ్ వెంకటేశ్వర స్వామి పాదాల వద్ద జై శ్రీరామ్ సాంగ్ ను లైవ్ ఇవ్వనున్నారు. ఇదే ఆయన దేవుడికి ఇస్తున్న కానుక అని మేకర్స్ చెప్పుకొచ్చారు. ఇక ఈ విషయం తెలియడంతో ప్రభాస్ ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. ఇప్పటివరకు ఇలాంటి ఫీట్ ఎవరు చేయలేదని, ప్రభాస్ మ్యూజిక్ డైరెక్టర్ మాత్రమే చేస్తున్నాడని చెప్పుకొస్తున్నారు. ఇక ఈ వార్త విన్నాకా తెలుగు ప్రేక్షకులు సైతం ఎక్కేశావయ్యా .. ప్రేక్షకుల గుండెల్లో ఒక మెట్టు ఎక్కేశావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Show comments