Mrunal Thakur: సీతారామం సినిమాతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది మృణాల్ ఠాకూర్. సీతగా ఆమె నటించింది అనడం కన్నా జీవించిందని చెప్పాలి. ఇక ఈ సినిమా విజయం తరువాత మృణాల్ ఏం చేసినా.. ఏది మాట్లాడినా సెన్సేషన్ క్రియేట్ అవుతూనే ఉంది. అంతేకాదు ఆమె కొద్దిగా చిట్టిపొట్టి డ్రెస్సులు వేసుకున్నా సరే టాలీవుడ్ ప్రేక్షకులు అంగీకరించడం లేదంటే అతిశయోక్తి కాదు. ఇక మృణాల్ కెరీర్ మొదట్లో ఎన్నో కష్టాలను అనుభవించిందంట.. ఒకసారి ట్రైన్ లో నుంచి దూకి ఆత్మహత్య కూడా చేసుకోవాలని అనిపించిందని ఒక ఇంటర్వ్యూలో చెప్పి బాధపడింది. అంతేకాకుండా ఒక సినిమాలో హీరోయిన్ గా తనను తీసుకొని ఆ తరువాత వద్దన్నారని, ప్రతి సినిమాలో తాను నటించే పాత్రలు న్యాచురల్ గా రావాలని షూటింగ్ ముందు చాలా హార్డ్ వర్క్ చేస్తానని చెప్పుకొచ్చింది.
“సుల్తాన్ సినిమాలో అనుష్క శర్మ పాత్ర కోసం ముందు నన్ను ఎంపిక చేశారు. ఆ సినిమా కోసం నేను 10 కేజీలు తగ్గాను. కానీ, ఆ తరువాత ఆ సినిమా నుంచి నన్ను తొలగించారు. ఎందుకు తొలగించారో నాకు అసలు తెలియనే తెలియదు.. నేను చాలా సన్నగా తయారవ్వడంతో తొలగించారని ఆ తరువాత తెల్సింది. ఇక లవ్ సోనియా సినిమా కోసం నేను పడిన కష్టం అంతా ఇంతా కాదు. అందులో వేశ్యా గృహం నుంచి తన చెల్లిని కాపాడుకోవడం కోసం తపన పడే అక్క పాత్రలో కనిపిస్తాను. తనను కాపాడడం కోసం వేశ్యగా మారాల్సి వస్తుంది. ఆ పాత్ర చేయడం చేయడం కోసం కోల్ కత్తా లోని వేశ్యా గృహంలో రెండు వారాలు గడిపాను. వారి బాధ, ఏడుపులు, జీవితాల గురించి వింటూ నరకం చూశాను. అక్కడ ఒక్కొక్కరిది ఒక్కో గాధ. వాటిని విన్న తరువాత నాకు చాలారోజులు నిద్రపట్టలేదు” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మృణాల్ వరుస సినిమాలతో బిజీగా మారింది. మరి మొదటి సినిమాతో స్టార్ హీరోయిన్ గా మారిన ఈ భామ ముందు ముందు అదే స్టార్ డమ్ ను మెయింటైన్ చేస్తుందా..? లేదా..? అనేది చూడాలి.