Mrunal Thakur: ఈ ఒక్కటి దాటేస్తే మృణాల్ ఠాకూర్ నిలబడ్డట్టే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mrunal Thakur hopes on Hi nanna Movie: మరాఠీ భామ మృణాల్ ఠాకూర్ ముందుగా సీరియల్స్ లో బిజీ ఆర్టిస్టుగా ఉండేది. నెమ్మదిగా మరాఠీ సినిమాలు, హిందీ సినిమాలు చేస్తూ వస్తున్నా ఆమెను ఏ ముహూర్తాన హను రాఘవపూడి చూశాడో కానీ ఠక్కున ఆమెకు సినీ హీరోయిన్ అవకాశం ఇచ్చేశాడు. అలా మృణాల్ ఠాకూర్ “సీతా రామం” సినిమాతో హీరోయిన్ గా మారి తెలుగు చిత్ర పరిశ్రమలో ఆకట్టుకున్నాడు. ఈ అందాల సుందరి తన రెండవ తెలుగు సినిమా కూడా ఇప్పుడు రిలీజ్ కి రెడీ అయింది. హీరో నానితో కలిసి “హాయ్ నాన్నా” సినిమాలో ఆమె హీరోయిన్ గా మారి విడుదలకు సిద్ధంగా ఉంది. ఆమె మొదటి సినిమా సూపర్ హిట్ కావడం, విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా ఆమె మంచి టాలెంట్ ఉన్న నటి అని కూడా ప్రూవ్ చ్చేసుకుంది. ఒకరకంగా ఆమె మొదటి సినిమా హిట్ కావడంతో ఆమెకు తెలుగులో వరుస అవకాశాలు వచ్చినా అన్నీ ఒప్పుకోకుండా నచ్చిన సినిమాలు మాత్రమే చేస్తూ వస్తోంది. అందులో భాగంగా నానితో హాయ్ నాన్న చేయగా విజయ్ దేవరకొండలో ఫ్యామిలీ స్టార్ అనే సినిమా చేస్తోంది.
Kota Bommali : ఇలాంటి సినిమా తీయాలంటే గట్స్ ఉండాలి !
Also Read
- Ajay Bhupathi: "శ్రీనివాస మంగాపురం" ఆడియో బ్లాక్‌బస్టర్ హిట్ కాబోతోంది: డైరెక్టర్ అజయ్ భూపతి
- Save The Tigers Season 3: ఆ ముగ్గురు మొగుళ్ల పంచాయితీలోకి ‘వెన్నెల కిషోర్’.. ‘సేవ్ ది టైగర్స్ 3’ లో నెక్స్ట్ లెవెల్ ఫన్ లోడింగ్!
- Kushboo Sundar: ఖుష్బూ ఇంట పెళ్లి సందడి.. కాబోయే కొత్త జంటకు పీఎం మోడీ ఆశీస్సులు!
- Bobby Deol: వైభవ్ బ్యాటింగ్‌కు ‘యానిమల్’ విలన్ ఫిదా.. 'దేవుడా ఆ బుడ్డోడికి దిష్టి తగలకుండా చూడు'!
అయితే ఈ హాయ్ నాన్న సినిమా మీదనే ఆమె కెరీర్ ఆధారపడి ఉంది. ఎందుకంటే చాలా మంది నటీనటులు -దర్శకులు సెకండ్ మూవీ సిండ్రోమ్ తో ఇబ్బంది పడతారు. టాలెంట్ వల్లనో అదృష్టం వల్లనో మొదటి సినిమా హిట్ కొట్టిన వారు రెండో సినిమా విషయంలో చాలా భయపడుతూ ఉంటారు. ఆ సినిమా పాస్ అయితే ఇక కెరీర్ కు డోకా లేదని అనుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో మృణాల్ ఠాకూర్ మాత్రం “హాయ్ నాన్నా” సినిమాతో విజయాన్ని సాధించగలననే నమ్మకంతో ఉన్నారు, ఈ సినిమాలో ఆమె ఒక ఆసక్తికరమైన పాత్రను పోషించింది. ఇక గత సినిమాలాగే ఈ సినిమా ప్రమోషన్స్‌లో కూడా మృణా చురుగ్గా పాల్గొంటున్నారు. నాని స్క్రిప్ట్ రీడింగ్ జడ్జిమెంట్, ఈ ప్రాజెక్ట్‌కి విలువైన ఆస్తి అని కూడా ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇక ఏది ఏమైనప్పటికీ, “హాయ్ నాన్నా” విజయం ఆమె తెలుగు సినీ పరిశ్రమలో కొనసాగడానికి కీలకమైనది. డిసెంబర్ 7న విడుదల కానున్న “హాయ్ నాన్న” మృణాల్ ఠాకూర్ తెలుగు సినిమా కెరీర్ మొత్తాన్ని నిర్దేశించే ముఖ్యమైన సినిమా . మరి చూడాలి మృణాల్ కెరీర్ ఎలా పరుగులు పెట్టబోతోంది? ఆమె సెకండ్ ఫిలిం సిండ్రోమ్ ఎలా ఉండబోతుంది అనేది.
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్‌ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్‌లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..