NTV Telugu Site icon

Mrunal Thakur: ఈ ఒక్కటి దాటేస్తే మృణాల్ ఠాకూర్ నిలబడ్డట్టే!

Mrunal Takur (2)

Mrunal Takur (2)

Mrunal Thakur hopes on Hi nanna Movie: మరాఠీ భామ మృణాల్ ఠాకూర్ ముందుగా సీరియల్స్ లో బిజీ ఆర్టిస్టుగా ఉండేది. నెమ్మదిగా మరాఠీ సినిమాలు, హిందీ సినిమాలు చేస్తూ వస్తున్నా ఆమెను ఏ ముహూర్తాన హను రాఘవపూడి చూశాడో కానీ ఠక్కున ఆమెకు సినీ హీరోయిన్ అవకాశం ఇచ్చేశాడు. అలా మృణాల్ ఠాకూర్ “సీతా రామం” సినిమాతో హీరోయిన్ గా మారి తెలుగు చిత్ర పరిశ్రమలో ఆకట్టుకున్నాడు. ఈ అందాల సుందరి తన రెండవ తెలుగు సినిమా కూడా ఇప్పుడు రిలీజ్ కి రెడీ అయింది. హీరో నానితో కలిసి “హాయ్ నాన్నా” సినిమాలో ఆమె హీరోయిన్ గా మారి విడుదలకు సిద్ధంగా ఉంది. ఆమె మొదటి సినిమా సూపర్ హిట్ కావడం, విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా ఆమె మంచి టాలెంట్ ఉన్న నటి అని కూడా ప్రూవ్ చ్చేసుకుంది. ఒకరకంగా ఆమె మొదటి సినిమా హిట్ కావడంతో ఆమెకు తెలుగులో వరుస అవకాశాలు వచ్చినా అన్నీ ఒప్పుకోకుండా నచ్చిన సినిమాలు మాత్రమే చేస్తూ వస్తోంది. అందులో భాగంగా నానితో హాయ్ నాన్న చేయగా విజయ్ దేవరకొండలో ఫ్యామిలీ స్టార్ అనే సినిమా చేస్తోంది.

Kota Bommali : ఇలాంటి సినిమా తీయాలంటే గ‌ట్స్ ఉండాలి !

అయితే ఈ హాయ్ నాన్న సినిమా మీదనే ఆమె కెరీర్ ఆధారపడి ఉంది. ఎందుకంటే చాలా మంది నటీనటులు -దర్శకులు సెకండ్ మూవీ సిండ్రోమ్ తో ఇబ్బంది పడతారు. టాలెంట్ వల్లనో అదృష్టం వల్లనో మొదటి సినిమా హిట్ కొట్టిన వారు రెండో సినిమా విషయంలో చాలా భయపడుతూ ఉంటారు. ఆ సినిమా పాస్ అయితే ఇక కెరీర్ కు డోకా లేదని అనుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో మృణాల్ ఠాకూర్ మాత్రం “హాయ్ నాన్నా” సినిమాతో విజయాన్ని సాధించగలననే నమ్మకంతో ఉన్నారు, ఈ సినిమాలో ఆమె ఒక ఆసక్తికరమైన పాత్రను పోషించింది. ఇక గత సినిమాలాగే ఈ సినిమా ప్రమోషన్స్‌లో కూడా మృణా చురుగ్గా పాల్గొంటున్నారు. నాని స్క్రిప్ట్ రీడింగ్ జడ్జిమెంట్, ఈ ప్రాజెక్ట్‌కి విలువైన ఆస్తి అని కూడా ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇక ఏది ఏమైనప్పటికీ, “హాయ్ నాన్నా” విజయం ఆమె తెలుగు సినీ పరిశ్రమలో కొనసాగడానికి కీలకమైనది. డిసెంబర్ 7న విడుదల కానున్న “హాయ్ నాన్న” మృణాల్ ఠాకూర్ తెలుగు సినిమా కెరీర్ మొత్తాన్ని నిర్దేశించే ముఖ్యమైన సినిమా . మరి చూడాలి మృణాల్ కెరీర్ ఎలా పరుగులు పెట్టబోతోంది? ఆమె సెకండ్ ఫిలిం సిండ్రోమ్ ఎలా ఉండబోతుంది అనేది.