Mrunal Thakur: పాపం.. సీత.. అల్లు అరవింద్ మాటలకు బాగా హార్ట్ అయినట్టు ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mrunal Thakur: సీతారామం సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ మృణాల్ రాకుర్. ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఈ సినిమా తరువాత అమ్మడు నటిస్తున్న తాజా చిత్రం హయ్ నాన్న. నాని హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శౌర్యవ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఇది కాకుండా మృణాల్.. ఫ్యామిలీ స్టార్ లో విజయ్ దేవరకొండ సరసన నటిస్తోంది. ఇక ఈ భామ సోషల్ మీడియాలో చేసే అరాచకం అంతా ఇంతా కాదు.. సీతారామం సినిమాలో నిండైన చీరకట్టుతో కనిపించి మెప్పించడంతో తెలుగు ప్రేక్షకులు తమ ఇంటి ఆడపడుచుగా మార్చేసుకున్నారు. కానీ, ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ పంథాలోనే కొనసాగుతోంది. హాట్ హాట్ ఫోటోషూట్స్ తో కుర్రకారును పిచ్చెక్కిస్తూనే ఉంది. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. మృణాల్ పెళ్లి గురించి వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
అసలు విషయమేటంటే .. ఈ ఏడాది సైమా అవార్డుల్లో మృణాల్ కు అవార్డు ఇస్తూ తెలుగు నిర్మాత అల్లు అరవింద్.. హైదరాబాద్ కు కోడలిగా వచ్చేసేయ్ అంటూ సరదాగా మాట్లాడాడు. ఇక ఈ మాటను ఫ్యాన్స్ సీరియస్ గా తీసుకొని.. టాలీవుడ్ హీరోతో మృణాల్ పెళ్లి, టాలీవుడ్ హీరో ప్రేమలో మృణాల్ అంటూ కామెంట్స్ పెట్టడంతో బాలీవుడ్ మొత్తం మృణాల్ పై పడిందంట. మృణాల్ హైదరాబాద్ కోడలిగా వెళ్తున్నావంట.. ? హీరోను పెళ్లాడబోతున్నావంటా.. ? అని అడిగేస్తున్నారట. దీంతో చిరెత్తుకొచ్చిన మృణాల్.. దెబ్బకు ఆ వార్తల్లో నిజం లేదని వీడియో రిలీజ్ చేసింది.
Also Read
- Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
- Dhanush Political Entry : తమిళనాడు రాజకీయాల్లోకి ధనుష్.. పార్టీ పేరు ఇదే?
- Tollywood: పాపం.. సక్సెస్ మీట్ కి డైరెక్టర్ నే పక్కన పెట్టారు.!
- Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
” ముందు మీ మనసు ముక్కలు చేస్తున్నందుకు.. నన్ను క్షమించండి. గత కొన్ని రోజులుగా నా పెళ్లి మీద వస్తున్న వార్తలు నిజం కాదు. నా ఫ్రెండ్స్ చాలామంది నాకు కాల్ చేసి తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకుంటున్నావా అని అడుగుతున్నారు. నాకు అదే తెలియడం లేదు. అసలు ఆ తెలుగబ్బాయి ఎవరు.. ? అతను ఎవరో నాక్కూడా చెప్తే బావుంటుంది. నిజానికి ఈ వార్త చదివి ఎంత నవ్వుకున్నానో.. పోనీ.. మీరే నాకు ఓ అబ్బాయిని చూసి పెట్టి అతడు ఎక్కడుంటాడో కనుక్కొని, పెళ్లి వేదిక కూడా రెడీ చేస్తే నేను వెంటనే పెళ్లి చేసుకుంటాను” అని చెప్పుకొచ్చింది. అమ్మడు సరదాగా నవ్వుతూ చెప్తున్నా.. అల్లు అరవింద్ మాటలకు బాగా హార్ట్ అయ్యినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ పెళ్లి వార్తలకు అమ్మడు చెక్ పెట్టింది అది చాలు అని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు.
తాజావార్తలు
-
CCRT Workshop: ఉపాధ్యాయులకు స్వర మాడ్యులేషన్పై ప్రత్యేక శిక్షణ..
-
Jailer 2: ట్రైలర్లోనే చెప్పేశాడు.. సర్ప్రైజింగ్గా ఏమైనా ఉంటుందా.. వెయ్యి కోట్లు కొల్లగొట్టేస్తుందా?
-
NMC Guidelines: డాక్టర్లకు నేషనల్ మెడికల్ కమిషన్ షాక్.. ‘బెస్ట్ డాక్టర్’, ‘100% క్యూర్’ అంటూ ప్రకటనలు ఇక బంద్!
-
Mohammad Kaif: గంభీర్.. యువ ఆటగాళ్ల జీవితాలను నాశనం చేస్తున్నావ్..!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
ట్రెండింగ్
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!