NTV Telugu Site icon

Mrunal Thakur: సరైన తోడు దొరకడం కష్టమే.. సంచలన నిర్ణయం తీసుకున్న మృణాల్ ఠాకూర్?

Mrunal Thakur Id Love

Mrunal Thakur Id Love

Mrunal Thakur Comments On Freezing Her Eggs:’సీతా రామం’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగు పెట్టింది మృణాల్. 2023లో ‘హాయ్ నాన్న’తో కూడా హిట్ కొట్టిన ఆమె ఈమధ్యనే ‘ది ఫ్యామిలీ స్టార్’ సినిమాతో ప్రేక్షకులను పలకటించింది. ఆమె త్వరలో హిందీలో సంజయ్ లీలా బన్సాలీ ‘పూజా మేరీ జాన్’లో కనిపించనుంది. తాజాగా ఆమె రిలేషన్ గురించి, పిల్లలని కనడం గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో, నటి మృణాల్ ఠాకూర్ తన వర్క్ లైఫ్, లైఫ్ బ్యాలెన్స్, తన ఎగ్స్ స్టోర్ చేయడం గురించి మాట్లాడింది. జీవితాన్ని, వృత్తిని బ్యాలెన్స్ చేయడం చాలా ముఖ్యం. కానీ మీరు ఎల్లప్పుడూ ఆ బ్యాలెన్స్‌ను ఎలా సృష్టించాలో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారని ఆమె పేర్కొంది. మృణాల్ ఠాకూర్ రిలేషన్స్ కష్టమని నాకు తెలుసు, అందుకే మీ పనిని అర్థం చేసుకునే సరైన పార్ట్నర్ ని మీరు కనుగొనాలి.

Salaar 2 : ప్రభాస్ కు జోడిగా రామ్ చరణ్ హీరోయిన్..డైరెక్టర్ ప్లాన్ అదిరింది..

అంతేకాదు నేను నా ఎగ్స్ ను స్టోర్ చేయడం గురించి కూడా ఆలోచిస్తున్నానని అంది. నటి మోనా సింగ్ తన గుడ్లను గడ్డకట్టడం గురించి ఇటీవల మాట్లాడిన విషయం వెలుగులోకి వచ్చిందని మృణాల్ తెలిపింది. మృణాల్ కూడా ‘మంచం నుండి లేవడానికి ఇష్టపడని’ రోజుల గురించి కామెంట్ చేసింది. అలంటి రోజుల్లో కూడా వెళ్లి షూట్ చేయవలసి వచ్చిందని చెప్పుకొచ్చింది. అలాంటి రోజులను అధిగమించడానికి తాను థెరపీ మరియు తన మనుషుల మీద ఆధారపడతానని ఆమె వెల్లడించింది. నేను నా వర్క్ ని బ్యాండ్-ఎయిడ్ లాగా ఉపయోగిస్తున్నా, కానీ నేను నా వస్తువులను ప్యాక్ చేసి ఇంటికి వెళ్ళగానే, బాధవేస్తుందని చెప్పుకొచ్చిన్ది. విభిన్న పాత్రలు పోషించే నటులకి థెరపీ అవసరం. అందుకే నేను థెరపీ తీసుకుంటా, నన్ను నా స్నేహితులు, నా సోదరి ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉంటారు. అంతెందుకు నా పిల్లి కూడా నా జీవితంలో మార్పు తెస్తుందని అంటూ ఆమె కామెంట్ చేసింది.

Show comments