NTV Telugu Site icon

Sree Vishnu : ఆసక్తి రేకెత్తిస్తోన్న ‘మృత్యుంజయ్’ టైటిల్ టీజర్

Sree Vishnu

Sree Vishnu

డిఫరెంట్ మూవీస్ ప్రేక్షకులను మెప్పిస్తోన్న కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీవిష్ణు ఇప్పుడు ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌తో అలరించబోతున్నారు. హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని రమ్య గుణ్ణం సమర్పణలో లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్‌ఫెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి నిర్మిస్తున్నారు. రెబా జాన్ హీరోయిన్. సామజవరగమన తర్వాత శ్రీవిష్ణు, రెబా జాన్ కలయికలో రాబోతున్న చిత్రమిది.

శుక్రవారం హీరో శ్రీవిష్ణు పుట్టినరోజు.. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. టైటిల్ టీజర్‌ను గమనిస్తే వాయిస్ ఓవర్‌లో ‘గేమ్ ఓవర్ జయ్’ అని వినిపిస్తోంది. శ్రీవిష్ణు ఇన్వెస్టిగేషన్‌కు సంబంధించిన ఫ్లాష్ కట్స్‌ను చూడొచ్చు. చాలా ఫాస్ట్‌గా చూపించిన ఈ గ్లింప్స్‌లో చిత్రంలోని నటీనటులతో పాటు శ్రీవిష్ణుని ఇన్వెస్టిగేటర్‌గా, ఖైదీగా చూడొచ్చు. చివర్లో ‘నేను చెప్పే వరకు గేమ్ ఫినిష్ కాదు’ అంటూ శ్రీవిష్ణు చెప్పే డైలాగ్ వస్తుంది. ఈ టైటిల్ టీజర్ ఆసక్తిని రేకెత్తిస్తూ ‘మృత్యుంజయ్’ అని సినిమా టైటిల్‌ను రివీల్ చేశారు. ‘మృత్యుంజయ్’ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. శ్రీవిష్ణు హీరోగా నటిస్తోన్న ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌ మరో ఇంట్రెస్టింగ్ ఎంటర్‌టైనర్‌గా మెప్పించనుందని తెలుస్తోంది. విద్యాసాగర్ సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి కాలభైరవ సంగీతాన్ని సమకూరుస్తుండగా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. మనీషా.ఎ.దత్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు.

Also Read : Kollywood : కోలీవుడ్ లో స్టార్ హీరోల మధ్య పోటీ.. గెలుపెవరిదో..?