NTV Telugu Site icon

Mr.Bachchan: భారీ స్థాయిలో బచ్చన్ థియేట్రికల్ బిజినెస్..కానీ..?

Untitled Design (37)

Untitled Design (37)

హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న రెండవ చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. భాగ్యశ్రీ బోర్ సే కథానాయకగా నటిస్తోంది. అత్యంత పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ  బ్యానర్ ఫై వివేక్ కూచిబొట్ల, TG విశ్వప్రసాద్ అత్యంత భారీ బడ్జెట్ లో ఈ చిత్రాన్ని నిర్మస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్, సితార్ అంటూ సాగే ఫస్ట్ సింగిల్ కు విపరీతమైన స్పందన లభించింది.

కాగా మిస్టర్ బచ్చన్ థియేట్రికల్ రైట్స్ అమ్మకాలు ప్రారంభించింది పీపుల్స్ మీడియా. ఇప్పటికే హిందీ రైట్స్ ను 25 కోట్ల రూపాయలకు అమ్మకాలు జరిపారు నిర్మాతలు. అటు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ 35కోట్ల రూపాయల దగ్గర ప్రారంభించారు. కేవలం ఆంధ్ర హక్కులు రూ. 18 కోట్ల కోట్ చేస్తున్నారు పీపుల్స్ మీడియా జనాలు. రవితేజమీద ఆ రేట్ అంటే ఆంధ్ర బయ్యర్లు అటు ఇటు తచ్చాడుతున్నారు. ఫైనల్ గా ఎక్కడ ఎగుతుందో ఇవాళో రేపో తేలనుంది.

ఇప్పటిదాకా నైజాంలో కొనసాగుతున్న సెటిమెంట్ ను పక్కన పెట్టింది పీపుల్స్ ఫ్యాక్టరీ. రెగ్యులర్ గా పీపుల్స్ మీడియా సినిమా ఏదైనా నైజాం ఎప్పుడు మైత్రీ మూవీస్ పంపిణి చేస్తుంది. కానీ తొలిసారి ఆ మైత్రీని కాదని svc సినిమాస్ అయినటువంటి దిల్ రాజు చేతిలో పెట్టారు. ఆగస్టు15న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. డబల్ ఇస్మార్ట్ తో పాటు మరో మూడు సినిమాలతో పోటీ పడనున్నాడు బచ్చన్. అటు డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ బచ్చన్ రైట్స్ 19.50కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ఈ చిత్రంలోని రెప్పల్ డప్పల్ అంటూ సాగే సెకండ్ సింగిల్ ఈ రోజు సాయంత్రం 5:04 గంటలకు విడుదల కానుంది.

Also Read: Tollywood : దిల్ రాజు సినిమాను వెనక్కు నెట్టిన మైత్రి మూవీస్.