మర్రి చెట్టు కింద మరే చెట్టు పెరగనట్టే , హై బడ్జెట్, స్టార్ క్యాస్టింగ్ ఉన్న సినిమాల హైప్ కారణంగా చిన్న సినిమాలు ఆడలేకపోతున్నాయి. సూపర్ బాయ్స్ ఆఫ్ మలేగావ్ సినిమా మాలేగావ్ లోని యువతీ-యువకుల హాస్యకథని ప్రధానంగా చూపిస్తుంది. లో బడ్జెట్ తో, ఒక మంచి కథతో ఈ సినిమా ప్రత్యేకతను నిలబెట్టుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద కేవలం రూ. 3.5 కోట్ల వసూళ్లు సాధించింది. కంటెంట్ ఉన్నప్పటికీ, పెద్ద హీరోలు లేకపోవడం, భారీ ప్రొమోషన్ చేయలేకపోవడం కారణంగా ప్రేక్షకుల వరకు చేరడం కష్టమైంది.
Also Read : NBK : యంగ్ హీరోలు.. బాలయ్యని చూసి నేర్చుకోండి ..
‘ది డిప్లోమాట్’, రాజకీయ థ్రిల్లర్ ఫ్లిక్స్‌లో ఒకటి, ఆకట్టుకునే కథ, స్ట్రాంగ్ హీరో & మార్కెటింగ్ తో రూ. 40.3 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. కానీ ‘ఫతె’, కంటెంట్ సరిగ్గా ఉన్నా కేవలం రూ. 12.8 కోట్లే వసూలు చేసింది. పెద్ద హీరోలు లేకపోవడం, సూపర్ హిట్ మార్కెటింగ్ ఫోర్స్ & ఆడియన్స్ సపోర్ట్ లేకపోవడం వల్ల, ఈ స్పష్టమైన తేడా కనిపించింది. అంటే, సినిమాలు ఎంత అద్భుతంగా చేసినా , ఆడియన్స్ రీచ్ & మార్కెటింగ్ ప్లాన్ కూడా కీలకం అనే విషయం స్పష్టమవుతోంది. 2025లో డెబ్యూ డైరెక్టర్ గిరీష్ కోహ్లీ దర్శకత్వంలో వచ్చిన చిత్రం క్రేజి. సోహం షా ప్రధాన పాత్రలో, తన కుమార్తెని కిడ్నాప్ నుండి రక్షించడానికి టైమ్ తో రేస్ చేసే సర్జన్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా 28 ఫిబ్రవరి 2025న థియేటర్లలో రిలీజ్ అయి మంచి కథ, రిఫ్రెషింగ్ కంటెంట్ ఉన్నప్పటికీ, పెద్ద హీరోలు , భారీ ప్రొమోషన్ లేకపోవడం వల్ల వసూళ్ల పరంగా పెద్ద విజయం సాధించలేకపోయింది. ఈ సినిమాలు చెబుతున్న విషయం ఏంటంటే బాలీవుడ్‌లో కంటెంట్ ఉన్న సినిమాలు కూడా, సరైన ప్రమోషన్ & ఆడియన్స్ రీచ్ లేక, పెద్ద విజయం సాధించలేక పోతున్నాయి. ఈ పరిస్థితి కేవలం బాలీవుడ్ కే పరిమితం కాదు, అన్నీ భాషా చిత్రాల్లోనూ ఉంది.
