Site icon NTV Telugu

మాస్ట్రో ట్రైలర్: ప్రశాంతంగా మొదలై.. మర్డర్ దాకా వెళ్ళింది

Maestro Official Trailer

Maestro Official Trailer

యంగ్ హీరో నితిన్ అంధుడిగా నటించిన చిత్రం ‘మాస్ట్రో’.. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నాడు. నితిన్‌ కు జంటగా నభా నటేశ్‌ జంటగా నటించగా.. మిల్కీ బ్యూటీ తమన్నా కీలక పాత్ర పోషించింది. శ్రేష్ఠ్‌ మూవీస్‌ పతాకంపై సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించారు. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ డిస్నీ+ హాట్‌స్టార్‌ వేదికగా త్వరలోనే స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ట్రైలర్‌ని విడుదల చేశారు. బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ చిత్ర ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది.

ప్రశాంతంగా మొదలైన ట్రైలర్.. ఆ తర్వాత మర్డర్ దాకా వెళ్ళింది. నితిన్ అంథుడిగా సంగీతం వాయిస్తూ.. నభాతో ప్రేమలో పడుతాడు. ఆపై తమన్నా ఎంట్రీ తరువాత సీన్ మారిపోతోంది. తమన్నా.. ఓ యువతిని బిల్డింగ్ మీద నుంచి తోసేయడం.. ఆ తర్వాత నితిన్ ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వడంతో ట్రైలర్ ఆసక్తికరంగా మారింది. నితిన్ అంధుడి పాత్రలో అద్భుతంగా నటించగా.. నభా, తమన్నా అందాలు ఆకట్టుకొన్నాయి. మరిముఖ్యంగా తమన్నా పెర్ఫార్మన్స్ ట్రైలర్ లో హైలైట్ గా నిలిచింది.

Exit mobile version