విక్టరీ వెంకటేష్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “నారప్ప”. సురేష్ బాబు, కలైపులి ఎస్ థాను నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ధనుష్ చిత్రం “అసురన్” రీమేక్ గా “నారప్ప” తెరకెక్కుతోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. జూలై 20న ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.
Read Also : “ఎస్ఆర్ కళ్యాణమండపం” హీరో బర్త్ డే స్పెషల్ టీజర్
అయితే భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ సినిమాను ఓటిటి ప్లాట్ ఫామ్ పై విడుదల చేయడం వెంకీ మామ అభిమానులకు అస్సలు ఇష్టం లేదు. కానీ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో ఓటిటిలోనే సినిమాను విడుదల చేయడం మంచిదని మేకర్స్ భావించారు. ముఖ్యంగా అభిమానులు, వారి కుటుంబాలు కరోనా బారిన పడకుండా జాగ్రత్తగా ఉండడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెంకటేష్ సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిమానులకు తెలియజేశారు. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ అద్భుతంగా సాగింది. “మన దగ్గిర భూమి ఉంటే తీసేసుకుంటారు… డబ్బుంటే లాగేసుకుంటారు… కానీ చదువు ఒక్కటి మాత్రం మన దగ్గిర నుంచి ఎవ్వరూ తీసుకోలేరు..” అంటూ వెంకటేష్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది.