NTV Telugu Site icon

విడుదలైన ‘కాలా’ మూవీ టీజర్!

హండ్రెడ్ ప‌ర్సెంట్ తెలుగు ఓటీటీ మాధ్య‌మం ‘ఆహా’. అందులో వచ్చే నెల జూన్ 4న టొవినో థామ‌స్ క‌థానాయ‌కుడిగా న‌టించిన మోస్ట్ అవెయిటెడ్ యాక్ష‌న్ డ్రామా ‘కాలా’ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ ఏడాది ప్ర‌థ‌మార్థంలో విడుద‌లైన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌తో పాటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌ను సైతం అందుకుంది. ఓ హింసాత్మ‌క ఘ‌ట‌న‌లో చనిపోయే కుక్క కార‌ణంగా ఇద్ద‌రి వ్య‌క్తుల మ‌ధ్య ఆస‌క్తిక‌ర‌మైన భావోద్వేగాల‌తో న‌డిచే క‌థే ‘కాలా’. టొవినో థామ‌స్‌, సుమేష్ మూర్‌, దివ్యా పిళ్లై, లాల్ పాల్‌, ప్ర‌మోద్ వెల్లియానంద్ కీల‌క పాత్ర‌లు పోషించిన ఈ చిత్రాన్ని రోహిత్ వి.ఎస్‌. డైరెక్ట్ చేశాడు. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదలైంది. దీనిని చూస్తుంటే ఒళ్ళు గగుర్పొడిచే యాక్షన్ సన్నివేశాలకు, థిల్లర్ సీన్స్ కు లోటు ఉండదనే విషయం అర్థమైపోతోంది.

Kala Telugu Teaser | Tovino Thomas | Rohith V S  | Premieres June 4 on aha