Site icon NTV Telugu

సినిమా టిక్కెట్ రేట్ల కమిటీ రేపు భేటీ!

ap

ap

ఆంధ్రప్రదేశ్ లో సినిమా టిక్కెట్ రేట్ల నిర్ణయంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తొలి సమావేశం శుక్రవారం మధ్యాహ్నం జరుగుబోతోంది. గత కొంతకాలంగా ఏపీ ప్రభుత్వం, చిత్రసీమ మధ్య కనిపించని అగాథం ఏర్పడింది. సినిమా టిక్కెట్ రేట్లను ప్రభుత్వం నిర్ణయించిన దానికంటే అధికంగా థియేటర్లలో అమ్ముతున్నారని, అలానే థియేటర్ల లైసెన్సులు రెన్యూల్ చేసుకోకుండా సినిమాలను ప్రదర్శిస్తున్నారని, ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్ నూ పొందకుండా సినిమా హాళ్ళు నడుపుతున్నారని సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని ఆరోపిస్తున్నారు.

ఇదే సమయంలో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు సినిమా థియేటర్లు నిర్వహించలేమని కొందరు, సరైన సమయంలో రెన్యూల్స్ చేసుకోలేక కొందరు సినిమా హాళ్ళను మూసేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సినిమా టిక్కెట్ రేట్ల నిర్ణయానికి వివిధ ప్రభుత్వ శాఖలు, సినిమా రంగానికి చెందిన ప్రముఖులు, ఫిల్మ్ గోయర్స్ తో ఓ కమిటీని వేసింది. దీనికి ఛైర్మన్ గా ఉన్న హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ తమ కమిటీ శుక్రవారం సమావేశం కాబోతోందని తెలిపారు. చిత్రసీమలోని వివిధ శాఖలకు సంబంధించిన ప్రతినిధులు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించిన అభ్యర్థనలను ఈ సమావేశంలో చర్చించే ఆస్కారం ఉంది.

Exit mobile version