Site icon NTV Telugu

తోట ప్రసాద్ కుమార్తెకు సినీ ప్రముఖుల ఆశీస్సులు

సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్, ఫిల్మ్ రైటర్, కథా రచయిత తోట ప్రసాద్ పలు దిన, సినిమా వార పత్రికలలో జర్నలిస్ట్ గా పనిచేశారు. కరోనా సెకండ్ వేవ్ సమయంలో తోట ప్రసాద్ తన భార్య గీత, రెండవ కుమార్తె మనోజ్ఞ సహకారంతో కరోనా బాధితులకు దాదాపు రెండు నెలల పాటు ఉచితంగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించారు. ఆయనలోని మానవీయ కోణాన్ని గుర్తించి సినీ ప్రముఖులు అభినందించారు. ఆగస్ట్ 14న తోట ప్రసాద్ కుమార్తె మనోజ్ఞ వివాహం సాయికృష్ణతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హోటల్ లో ఘనంగా జరిగింది. ఈ వివాహానికి చిత్రసీమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై నవ దంపతులకు శుభాశీస్సులు అందించారు. అందులో ప్రముఖ సినీ నిర్మాత, శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్, తెలంగాణ ఎఫ్.డి.సి. ఛైర్మన్ పుస్కర్ రామమోహన్ రావు, దర్శకులు మెహర్ రమేశ్, యోగి, సాయి రాజేశ్, మున్నా తదితరులు ఉన్నారు.

Exit mobile version