Mounika Reddy: సూర్య అనే వెబ్ సిరీస్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి మౌనిక రెడ్డి. ఈ సిరీస్ తరువాత ఈ భామ వరుస సినిమా అవకాశాలను అందుకుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాలో లేడీ కానిస్టేబుల్ గా నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక భీమ్లా నాయక్ తరువాత మౌనిక.. పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా మారింది. అమ్మడి సినిమాల విషయం పక్కన పెడితే.. గత కొన్నిరోజుల నుంచి మౌనిక విడాకుల వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. గతేడాది సందీప్ అనే బిజినెస్ మ్యాన్ తో మౌనిక వివాహం గోవాలో చాలా గ్రాండ్ గా జరిగింది. పెళ్లి రోజు మౌనిక చేసిన హంగామా వీడియో ఇప్పటికీ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ భామ మూడు రోజుల క్రితం.. ఇన్స్టాగ్రామ్ లో తమ పెళ్ళికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు డిలీట్ చేసింది. అంతేకాకుండా భర్త సందీప్ ను అన్ ఫాలో చేసింది. దీంతో వీరిద్దరి మధ్య విబేధాలు నెలకొన్నాయని, వీరు విడాకులు తీసుకుంటున్నారని వార్తలు వైరల్ గా మారాయి. పెళ్ళై ఏడాది కూడా కాకముందే విడాకులు తీసుకోవడానికి పెళ్లి ఎందుకు చేసుకోవడం అంటూ నెటిజన్స్ ఆమెను ఏకిపారేశారు.
Mansion 24: ఓంకారన్న.. ఏందీ అరాచకం.. వణికిస్తోన్న ‘మ్యాన్షన్ 24’ ట్రైలర్
ఇక తాజాగా ఈ రూమర్స్ పై మౌనిక స్పందించింది. తన భర్తతో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని చెప్పుకొచ్చింది. “మనం ట్రేండింగ్ లో ఉన్నాం అని మౌనిక చెప్పగా, తన భర్త రియాక్ట్ అవుతూ.. ఏ పిఆర్ అయినా మంచి పిఆర్‌గా అంటూ సరదాగా బదులిచ్చాడు. అంతేకాకుండా చివరిలో.. సోషల్ మీడియాలో ఏవేవో వస్తుంటాయి. అవి పట్టించుకోకుండా ముందుకు సాగుతూ వెళ్లిపోవడమే” అని చెప్పుకొచ్చింది. దీంతో ఈ విడాకులు న్యూస్ ఫేక్ అని తెలుస్తోంది. అయితే.. అంత సడెన్ గా పెళ్లి ఫోటోలు డిలీట్ ఎందుకు చేయాల్సివచ్చిందో మాత్రం అమ్మడు చెప్పకపోవడం విశేషమని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.