Mouni Roy: నాగిని సీరియల్ తో హిందీ తో పాటు అన్ని భాషల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకొంది. ఇక సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ ఘాటు అందాల ప్రదర్శనకు అభిమానులు పిచ్చెక్కిపోతుంటారు. ఇక ఇటీవలే బ్రహ్మాస్త్ర సినిమాలో జునూన్(దమయంతి) పాత్రలో నట విశ్వరూపం చూపించింది. ఇక ఈ పాత్రలో మౌనీ రాయ్ నటనను కొంతమంది విమర్శించినా.. ఎక్కువశాతం మంది అమ్మడి నటనకు ఫిదా అయ్యారు. ఇకపోతే ఈ సినిమా తరువాత మౌనీకి మంచి అవకాశాలే వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఈ నాగిని కన్ను మొత్తం టాలీవుడ్ పైనే ఉందట.. ముఖ్యంగా దర్శక ధీరుడు రాజమౌళి సినిమాలో చేయడానికి చచ్చిపోతున్నా అని చెప్పుకొచ్చింది.
ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మౌని రాయ్ మాట్లాడుతూ “నాగార్జున గారితో వర్క్ చేయడం ఎంతో సంతోషంగా ఉంది. ఇక తెలుగులో నాకు రామ్ చరణ్, అల్లు అర్జున్ సినిమాల్లో చేయాలనీ ఉంది. ముఖ్యంగా రాజమౌళి దర్శకత్వంలో చేయడం కోసం నేను చచ్చిపోతున్నా.. ఆయన అన్ని సినిమాలకు నేను పెద్ద ఫ్యాన్. ఆయన సినిమాలో ఒక పాత్ర కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నాను” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. చిత్ర పరిశ్రమలో ఉన్నవారందరికి.. జక్కన్న సినిమాలో చేయాలనేది ఒక పెద్ద కోరిక అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆ లిస్ట్ లో నాగిని భామ కూడా చేరిపోయింది. మరి ముద్దుగుమ్మ ఆశను జక్కన్న తీరుస్తాడా..? లేదా అనేది కాలమే చెప్పాలి.