NTV Telugu Site icon

Vrushabha: మోహన్ లాల్, రోష‌న్ ‘వృషభ’కి హాలీవుడ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్

Vrushabha

Vrushabha

మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహన్ లాన్, మన హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్, శనయ కపూర్‌, జహ్రా ఖాన్‌ల‌తో పాన్ ఇండియా వైడ్‌గా ఒక సినిమా చేస్తున్నారు. భారీ బ‌డ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి ‘వృషభ’ అనే టైటిల్ ఫిక్స్ చేయగా ఇప్పుడు ఈ ప్రాజెక్టులో హాలీవుడ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నిక్ తుర్లో ఎంటర్ అయ్యారు. ఆస్కార్ సాధించిన మూన్ లైట్ (2016), థ్రీ బిల్‌బోర్డ్స్ అవుట్ సైడ్ ఎబ్బింగ్, మిస్సోరీ (2017) వంటి ఎన్నో హాలీవుడ్ సినిమాలు నిక్ తుర్లో నిర్మించారు, సహ నిర్మాతగా వ్యవహరించారు. వృషభ టీంలోకి నిక్ తుర్లో రావడంతో ఈ సినిమా హాలీవుడ్ రేంజ్‌లో తెరకెక్కబోతోందనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన సెట్ కి వచ్చిన సందర్భంగా 57 సెకన్ల వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో సినిమాలోని సెట్స్, ఎంత భారీగా తెరకెక్కించబోతోన్నారనే విషయాన్ని చూపించడం గమనార్హం. ఇక హాలీవుడ్ స్టైల్‌ను ఫాలో అవుతూ చేస్తోన్న మొదటి సినిమాగా వృషభ రికార్డులకు ఎక్కింది.

AP CM Jagan: పారదర్శకంగా పోలవరం పునరావాస ప్యాకేజీ .. అందరికీ న్యాయం చేస్తాం

ఈ క్రమంలో నిక్ తుర్లో మాట్లాడుతూ ‘వృషభ అనేది నా మొదటి ఇండియన్ సినిమా, ఈ సినిమాలో నేను భాగస్వామిని అవ్వడం నాకు ఎంతో ఆనందంగా ఉందమొ ఉన్నారు. హాలీవుడ్ కాకుండా ఇతర దేశాల్లో నేను పని చేస్తున్న మొదటి సినిమా ఇదని, అలానే నేను ఫస్ట్ టైం ఓ మల్టీ లింగ్యువల్ సినిమాకు పని చేస్తున్నానని అన్నారు. నేను ప్రతీ సినిమాను మొదటిదానిలానే ఫీల్ అవుతానని, ప్రతీ సినిమా నుంచి ఏదో ఒకటి కొత్త విషయాన్ని నేర్చుకుంటూ ఉంటానని,. వృషభ సైతం అలాంటి ఓ అందమైన ప్రయాణం అవుతుందని ఆశిస్తున్నానని అన్నారు. ఇక తండ్రీ కొడుకుల మధ్య వచ్చే హై ఆక్టేన్ ఎమోషనల్ డ్రామాగా వృషభ తెరకెక్కుతోంది. కనెక్ట్ మీడియా, బాలాజీ టెలీఫిల్మ్స్, ఏవీఎస్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి నంద కిషోర్ దర్శకత్వం వహిస్తుండగా అభిషేక్ వ్యాస్, విశాల్ గుర్నాని, జుహి పరేఖ్ మెహతా, శ్యామ్ సుందర్, ఏక్తా కపూర్, శోభా కపూర్, వరుణ్ మథూర్, సౌరభ్ మిశ్రాలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఏకకాలంలో తెలుగు, మలయాళీ భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ మూవీని హిందీ, కన్నడ, తమిళ భాషల్లోనూ డబ్బింగ్ చేయించి రిలీజ్ చేయబోతోన్నారు.