Vrushabha: మోహన్ లాల్, రోషన్ ‘వృషభ’కి హాలీవుడ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాన్, మన హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్, శనయ కపూర్, జహ్రా ఖాన్‌లతో పాన్ ఇండియా వైడ్‌గా ఒక సినిమా చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి ‘వృషభ’ అనే టైటిల్ ఫిక్స్ చేయగా ఇప్పుడు ఈ ప్రాజెక్టులో హాలీవుడ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నిక్ తుర్లో ఎంటర్ అయ్యారు. ఆస్కార్ సాధించిన మూన్ లైట్ (2016), థ్రీ బిల్‌బోర్డ్స్ అవుట్ సైడ్ ఎబ్బింగ్, మిస్సోరీ (2017) వంటి ఎన్నో హాలీవుడ్ సినిమాలు నిక్ తుర్లో నిర్మించారు, సహ నిర్మాతగా వ్యవహరించారు. వృషభ టీంలోకి నిక్ తుర్లో రావడంతో ఈ సినిమా హాలీవుడ్ రేంజ్‌లో తెరకెక్కబోతోందనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన సెట్ కి వచ్చిన సందర్భంగా 57 సెకన్ల వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో సినిమాలోని సెట్స్, ఎంత భారీగా తెరకెక్కించబోతోన్నారనే విషయాన్ని చూపించడం గమనార్హం. ఇక హాలీవుడ్ స్టైల్‌ను ఫాలో అవుతూ చేస్తోన్న మొదటి సినిమాగా వృషభ రికార్డులకు ఎక్కింది.
AP CM Jagan: పారదర్శకంగా పోలవరం పునరావాస ప్యాకేజీ .. అందరికీ న్యాయం చేస్తాం
Also Read
ఈ క్రమంలో నిక్ తుర్లో మాట్లాడుతూ ‘వృషభ అనేది నా మొదటి ఇండియన్ సినిమా, ఈ సినిమాలో నేను భాగస్వామిని అవ్వడం నాకు ఎంతో ఆనందంగా ఉందమొ ఉన్నారు. హాలీవుడ్ కాకుండా ఇతర దేశాల్లో నేను పని చేస్తున్న మొదటి సినిమా ఇదని, అలానే నేను ఫస్ట్ టైం ఓ మల్టీ లింగ్యువల్ సినిమాకు పని చేస్తున్నానని అన్నారు. నేను ప్రతీ సినిమాను మొదటిదానిలానే ఫీల్ అవుతానని, ప్రతీ సినిమా నుంచి ఏదో ఒకటి కొత్త విషయాన్ని నేర్చుకుంటూ ఉంటానని,. వృషభ సైతం అలాంటి ఓ అందమైన ప్రయాణం అవుతుందని ఆశిస్తున్నానని అన్నారు. ఇక తండ్రీ కొడుకుల మధ్య వచ్చే హై ఆక్టేన్ ఎమోషనల్ డ్రామాగా వృషభ తెరకెక్కుతోంది. కనెక్ట్ మీడియా, బాలాజీ టెలీఫిల్మ్స్, ఏవీఎస్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి నంద కిషోర్ దర్శకత్వం వహిస్తుండగా అభిషేక్ వ్యాస్, విశాల్ గుర్నాని, జుహి పరేఖ్ మెహతా, శ్యామ్ సుందర్, ఏక్తా కపూర్, శోభా కపూర్, వరుణ్ మథూర్, సౌరభ్ మిశ్రాలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఏకకాలంలో తెలుగు, మలయాళీ భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ మూవీని హిందీ, కన్నడ, తమిళ భాషల్లోనూ డబ్బింగ్ చేయించి రిలీజ్ చేయబోతోన్నారు.
తాజావార్తలు
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!