Site icon NTV Telugu

Monica Bedi: ఆ హీరో.. రా.. అనగానే వెళ్లి ఉంటే.. అవకాశం వచ్చేది

Monica

Monica

Monica Bedi: టాలీవుడ్ క్లాసిక్ మూవీ తాజమహల్ సినిమా గుర్తుందా.. ? శ్రీకాంత్ హీరోగా నటించిన ఈచిత్రంతోనే బాలీవుడ్ నటి మోనికా బేడీ తెలుగుతెరకు పరిచయమైంది. అందమే అసూయ పడుతుందా అనేంత ఆమె అందం అభిమానులను మంత్రం ముగ్దులను చేసింది. ఈ సినిమా తరువాత అమ్మడికి వరుస అవకాశాలు క్యూ కట్టాయి. అయితే.. అమ్మడికి మాత్రం ఆశించిన ఫలితం మాత్రం అందుకోలేకపోయింది. దీంతో మోనికా బాలీవుడ్ కే పరిమితమయ్యింది. ఇక ఆ తరువాత చాలా వివాదాల వలన ఫేమస్ అయిన ఆమె.. బిగ్ బాస్ సీజన్ 2 లో పాల్గొని మెప్పించింది. అయితే కెరీర్ మొదట్లో తాను చేసిన తప్పు వలన మంచి అవకాశాన్ని మిస్ చేసుకున్నట్లు ఆమె తెలిపింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. ” మొదటి సారి దర్శకుడు సుభాష్‌ ఘై హోలీ పార్టీకి వెళ్ళాను. అక్కడ రాకేష్ రోషన్ నన్ను చూసి మాట్లాడాడు. ఆయన ఒక నటుడు అని తెలుసు కానీ, డైరెక్టర్, నిర్మాత అన్న విషయం నాకు తెలియదు. అయితే పార్టీ మొత్తం అయ్యాకా.. ఆయన విజిటింగ్ కార్డు నా చేతికి ఇచ్చి రేపు ఆఫీస్ కు రా అని చెప్పాడు.

Rashmika: రష్మిక వెనుక కుట్ర.. అతడే చేయిస్తున్నాడా..?

ఇక దీంతో నేను ఈయనేంటి.. నన్ను రమ్మంటున్నాడు అని అనుకోని.. విజిటింగ్ కార్డును చింపి ముక్కలు చేశాను. ఆ తరువాత కొన్నిరోజులు నా మేనేజర్ వచ్చి.. రాకేష్ రోషన్ ఆఫీస్ కు రమ్మంటే వెళ్ళలేదు అంట .. ఎందుకు అని అడిగాడు. అతను నటుడు అని మాత్రమే తెలుసు.. నిర్మాత అని తెలియదు చెప్పాను. అతడు కరణ్‌ అర్జున్‌ సినిమా తీస్తున్నాడు. అందులో సల్మాన్ సరసన నీకు హీరోయిన్ గా ఛాన్స్ ఇవ్వడానికి పిలిచాడు. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పాత్రలో మమతా కులకర్ణిని తీసుకున్నారు అని చెప్పాడు. నేను షాక్ అయ్యాను. ఆయన రా అనగానే వెళ్లి ఉంటే మంచి అవకాశాన్ని అందుకొనేదాన్ని. ఇక మరోసారి .. ఒక సినిమా ఒప్పుకుని.. ఆ సినిమా పూర్తి అయ్యేవరకు మరో సినిమా చేయను అని బాండ్ రాశాను. దానివలన చాలా మంచి అవకాశాలు పోయాయి. ఎన్ని అవకాశాలు వదులుకున్న ఈ సినిమా కొన్ని కారణాల వలన సెట్స్ మీదకు కూడా వెళ్ళలేదు. అలా ఏడాదిన్నర ఖాళీగా ఉన్నాను.. ఇది అతడి తప్పు కాదు. కొన్ని సార్లు మనం అనుకున్నవన్నీ అనుకున్నట్లుగా జరగవంతే” అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

Exit mobile version