Site icon NTV Telugu

‘మనీ హెయిస్ట్‌’ ఫైనల్ సీజన్: సెలవు ప్రకటించిన ఐటీ

Money Heist season 5

Money Heist season 5

‘మనీ హెయిస్ట్‌’.. ఎక్కడో స్పెయిన్‌లో తెరకెక్కిన ఈ సిరీస్‌కి ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ఫ్యాన్స్‌ వున్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో ఎక్కువ వ్యూయర్‌షిప్‌ ఉన్న సిరీస్‌ కూడా ఇదే కావటం విశేషం. మనీ హెయిస్ట్‌ ఇప్పటిదాకా రెండు సీజన్స్‌.. నాలుగు పార్ట్‌లు.. 31 ఎపిసోడ్స్‌గా టెలికాస్ట్ అయ్యింది. ఇప్పుడు రెండో సీజన్‌లో ఐదో పార్ట్‌ గా పది ఎపిసోడ్స్‌తో రాబోతోంది. సెప్టెంబర్‌ 3న ఐదు ఎపిసోడ్స్‌గా రిలీజ్‌ కానుంది. ఆపై డిసెంబర్‌లో మిగిలిన ఐదు రిలీజ్‌ అవుతాయి. దీంతో ఎప్పుడెప్పుడు చూసేద్దామా అనే ఎగ్జయిట్‌మెంట్‌ ఫ్యాన్స్‌లో మొదలైంది.

అయితే తాజాగా రాజస్థాన్ లోని జైపూర్ ఐటీ కంపెనీలు ‘మనీ హెయిస్ట్‌’ ఫైనల్ సీజన్ కోసం సెలవును ప్రకటించాయి. ఒక కంపెనీ ప్రకటించిందో లేదో, అప్పుడే మిగితా కంపెనీలు కూడా అదే బాటలో సెలవును ప్రకటిస్తున్నాయి.. ఉద్యోగులు కాస్త రిలాక్స్ & చీల్ అవుతారని కోరుకొంటూ సెప్టెంబర్‌ 3 హోలీ డే ప్రకటనలు చేస్తున్నారు.

https://youtu.be/htqXL94Rza4
Exit mobile version