Monalisa- Farman Khan: మహా కుంభమేళా సమయంలో వైరల్‌గా మారిని మోనాలిసా భోంస్లే మరోసారి వార్తల్లో నిలిచింది. మార్చి 11న కేరళలోని అరుమనూర్‌లోని నాయనార్ ఆలయంలో తన ముస్లిం బాయ్‌ఫ్రెండ్ ఫర్మాన్ ఖాన్‌ను పెళ్లి చేసుకుంది. ఈ వివాహం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కొందరు దీనిని ‘‘లవ్ జిహాద్’’ అని ఆరోపించారు. అయితే, కొత్త జంట ఈ ఆరోపణల్ని కొట్టిపారేసింది.
ఫర్మాన్ ఖాన్ ఎవరు.?
ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్ జిల్లాకు చెందిన ఫర్మాన్, మలయాళం, హిందీ, తమిళ చిత్రాలలో నటుడిగా పనిచేస్తున్నారు. ఇద్దరం ఆరు నెలల నుంచి డేటింగ్ చేస్తున్నామని మోనాలిసా వెల్లడించింది. వీరిద్దరు సోషల్ మీడియా ద్వారా కలిశారు. ఆ తర్వాత ఒక సినిమా సెట్‌లో కలిశారు. అప్పటి నుంచి స్నేహం ఆ తర్వాత ప్రేమ, పెళ్లికి దారి తీసింది. పి బిను వర్గీస్ దర్శకత్వం వహించిన నాగమ్మ అనే మలయాళ చిత్రం ముహూర్త వేడుకలో వారు కలుసుకున్నారు. ఈ సినిమాలో ఫర్మాన్ ఖాన్ విలన్‌గా మోనాలిసా లీడ్ క్యారెక్టర్‌గా నటించారు.
నాటకీయంగా పెళ్లి:
వివాహానికి ముందు వీరిద్దరు కేరళ పోలీసుల సాయాన్ని కోరారు. మోనాలిసా, ఫర్మాన్ కేరళలో పనిచేస్తు్న చిత్ర బృందంతో కలిసి పోలీస్ స్టేషన్ వచ్చారు. మోనాలిసా కుటుంబీకులకు ఈ పెళ్లి ఇష్టం లేదు. మోనాలిసా తన తండ్రితో వెళ్లేందుకు నిరాకరించింది, ప్రియుడితోనే ఉంటానని చె ప్పింది. అతడిని వావాహం చేసుకోవాలని అనుకుంటున్నట్లు పోలీసుల ముందు వెల్లడించింది. ఆమె మేజర్ కావడంతో ఆమె ఇష్ట ప్రకారం నడుచుకునే హక్కు ఉందని పోలీసులు చెప్పారు.
రాజకీయ నాయకుల ఆశీర్వాదంతో వివాహం:
ఇద్దరి వివాహ వేడుకకు వి శివన్‌కుట్టి, ఎంవి గోవిందన్, ఎఎ రహీమ్‌తో సహా అనేక మంది రాజకీయ నాయకులు హాజరైనట్లు తెలుస్తోంది. రహీమ్ మాట్లాడుతూ.. కేరళ సామాజిక సామరస్యానికి ప్రతీక అని అన్నారు. “రాజ్యాంగం వివిధ మతాల ప్రజలు వివాహం చేసుకోవడానికి అనుమతిస్తుంది. మేము ఈ జంటతో కలిసి వేడుకలో పాల్గొనడానికి ఇక్కడికి వచ్చాము” అని ఆయన అన్నారు.
