ఒక్కప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘దృశ్యం’ సిరీస్, ఇప్పుడు నేరుగా డబ్డ్ వెర్షన్ లోనే మే 21న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే, ఈ సారి రాబోతున్న ‘దృశ్యం పార్ట్ 3’లో హీరో వెంకటేష్ కాదనే రీజనో, లేక మరే ఇతర కారణాల వల్లనో కానీ, తెలుగులో బుకింగ్స్ అనేవి మాత్రం చాలా అంటే చాలా పేలవంగా ఉన్నాయి. ఒకపక్క పాన్ సౌత్ ఇండియా ఆడియన్స్ ని లక్ష్యంగా చేసుకొని వరల్డ్ వైడ్ గా రిలీజ్ కి రెడీ అయిన ఈ మోహన్ లాల్ ‘దృశ్యం 3’, అటు గల్ఫ్ దేశాలు, కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు కలుపుకొని వరల్డ్ వైడ్ గా 20 కోట్ల పైనే అడ్వాన్స్ ప్రీ-బుకింగ్ బిజినెస్ అందుకుంటే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆ స్పీడ్ ఎక్కడా కనిపించడం లేదు. మేకర్స్ ఒక్క ప్రమోషన్ ఈవెంట్ ని కూడా తెలుగు రాష్ట్రాల్లో చెయ్యకుండా, దృశ్యం ఫ్రాంచైజీకి ఉన్న క్రేజ్ నే నమ్ముకుంటూ అనుసరిస్తున్న ఈ కొత్త మార్కెటింగ్ స్ట్రాటజీ ఏ మేరకు వర్కవుట్ అవుతుందో ఆ దేవుడికే తెలియాలి.
అంతేకాదు, ‘మంజుమ్మల్ బాయ్స్’, ‘ప్రేమలు’ వంటి చిన్న చిన్న మలయాళ చిత్రాలను కూడా పెద్ద పెద్ద హిట్లు చేసిన మన తెలుగు ప్రేక్షకులను ఈ ‘దృశ్యం’ ఒరిజినల్ మేకర్స్ లైట్ తీసుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చకు దారి తీస్తోంది. దీంతో, గత రెండు పార్ట్స్ లో రాంబాబు పాత్రతో తెలుగు ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్ చేసిన హీరో వెంకటేష్ నే ఈ తెలుగు ‘దృశ్యం 3’లో కూడా పెట్టి ఉంటే, ఈ రోజు కథ వేరేలా ఉండేది అని సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది. sమరి చూడాలి, ఈ మోహన్ లాల్ డబ్బింగ్ సినిమా రేపు విడుదలయ్యాకైనా పాజిటివ్ టాక్ తెచ్చుకుని, మౌత్ పబ్లిసిటీతో కలెక్షన్లలో దూసుకెళ్తుందో? లేదో? అనేది!
