Mohan Babu: ఓటమి సహించలేక.. వాళ్లేం చేశారో అందరికీ తెలుసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohan Babu Comments On MAA Association: మా అధ్యక్షుడిగా ఎన్నికై ఏడాది పూర్తైన సందర్భంగా.. మంచు విష్ణు మీడియా సమావేశం నిర్వహించాడు. ఇందుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మోహన్ బాబు.. కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తొలుత తన స్నేహితుడు, సీనియర్ నటుడు కృష్ణంరాజుని గుర్తు చేసుకున్నారు. మంచు విష్ణుకి ఎన్నో మంచి విషయాలు సలహాలు ఇచ్చేవారని, ఇప్పుడు ఆయన లేని లోటు తీవ్రంగా బాధిస్తోందని అన్నారు. అనంతరం మంచు విష్ణు ప్యానెల్ సభ్యులందరూ అద్బుతంగా పనితనం చాటుతున్నారంటూ కొనియాడారు. ఓడిపోవడం, గెలవడం సహజమేనని.. కానీ మా ఎన్నికల్లో ఓటమిని సహించలేక కొందరు ఏం చేశారో అందరికీ తెలుసన్నారు. రమణ మహర్షి చెప్పినట్టు.. ఎన్ని దుర్గుణాలున్నాయో, వాటిని మిక్సీలో వేశాక తయారయ్యేవాడే మనిషి అని అన్నారు. అంటే.. మనిషి మొత్తం విషమేనని, ఎన్నికల్లో ఓడిపోయాక కొందరు తమలోని విషాన్ని చిమ్మారని, అయినప్పటికీ వాళ్లు బాగుండాలని తాను కోరుకుంటున్నానని అన్నారు.
తాను మా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు.. ఎప్పుడు ఇలాంటి మీటింగులు గానీ, డిన్నర్‌లు ఇవ్వడం గానీ చేయలేదని మోహన్ బాబు గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ‘సెల్ఫ్ డబ్బా’ నిర్వచనాన్ని వివరిస్తూ.. సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం కూడా అవసరమేనని అన్నారు. రామాయణంలో సీత ముందు హనుమంతుడు వినయంగా ఉంటే, రావణుడి ముందు మాత్రం విశ్వరూపం చూపించాడని.. అలాగే మనం ఏం చేశామన్నది పది మందికి చెప్పడం తప్పేం కాదని, అది సద్గుణమని చెప్పారు. మంచి పని చేయకుండా గొప్పలు చెప్పుకుంటే సెల్ఫీ డబ్బా అవుతుందని.. మంచి పని చేస్తున్నప్పుడు, చేసి చూపిస్తున్నప్పుడు ‘సెల్ఫ్ డబ్బా’ కాదని చెప్పుకొచ్చారు. మంచు విష్ణు చేసే పనుల్లో మోసం లేదు, దగా లేదని అన్నారు. మా సభ్యులందరికీ శిరిడీ సాయి ఆశీస్సులు ఉండాలని కోరిన ఆయన.. అందరూ కలిసి ఐక్యంగా ఉండాలని సూచించారు.
Also Read
- Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
- Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
తాజావార్తలు
-
Virat Kohli: సచిన్ టెండూల్కర్ ఆల్-టైమ్ రికార్డుపై కన్నేసిన విరాట్.. కోహ్లీ ముందు 3 భారీ మైలురాళ్ళు..!
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!