Modern Missamma: గోపీ సుందర్ మార్క్ మ్యూజిక్‌తో ‘మోడ్రన్ మిస్సమ్మ’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లాస్య అండ్ మిధున క్రియేషన్స్ పతాకంపై చిరంజీవి పమిడి, శివ పమిడి, కిరణ్ కుమార్ నల్లూరి, స్రవంతి నంబూరి సంయుక్తంగా నిర్మిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘మోడ్రన్ మిస్సమ్మ’. హర్ష నర్రా, తన్మయి ఖుషి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సాయిబాబా కథ, స్క్రీన్‌ప్లే సమకూర్చి దర్శకత్వం వహిస్తున్నారు. బుధవారం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ సింగిల్‌ను చిత్ర యూనిట్ ఘనంగా విడుదల చేసింది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ స్వరపరిచిన ఈ గీతానికి ప్రముఖ గేయ రచయిత కిట్టు విస్సాప్రగడ ఆకట్టుకునే సాహిత్యం అందించారు. హీరో సంప్రదాయ పంచెకట్టులో, హీరోయిన్ తన్మయి ట్రెడిషనల్ లుక్‌లో కనిపించే ఈ పాట నేటి తరం మహిళలకు బాగా కనెక్ట్ అయ్యేలా సాగింది.
ఈ సందర్భంగా హీరోయిన్ తన్మయి ఖుషి మాట్లాడుతూ.. “మన్మథుడు సినిమాలో ‘వద్దురా సోదరా’ పాట అప్పట్లో అబ్బాయిలకు ఎంతగా కనెక్ట్ అయిందో, ఇప్పుడు మా సినిమాలో ‘బెటర్ బీ ఏ మిస్సమ్మ’ పాట అమ్మాయిల మనసులకు అంతగా హత్తుకుంటుంది. అమ్మాయిల పాయింట్ ఆఫ్ వ్యూలో దర్శకుడు ఈ కథను చాలా చక్కగా రాశారు” అని తెలిపారు. హీరో హర్ష నర్రా మాట్లాడుతూ.. “మిస్సింగ్, రోటి కపడా రొమాన్స్ చిత్రాల తర్వాత నేను చేస్తున్న మూడో సినిమా ఇది. ఈ చిత్రాన్ని మేమంతా ఎంతో ఇష్టపడి, స్నేహితుల్లా కలిసి పనిచేశాం. గోపీ సుందర్ ఇచ్చిన సంగీతం, కిట్టు విస్సాప్రగడ రాసిన లిరిక్స్ అందరూ రిలేట్ చేసుకునేలా ఉంటాయి” అని ధీమా వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో డాక్టర్ భద్రం, శివన్నారాయణ, సిజు ఏఆర్, ప్రమోదిని, హారిక, రాకేష్ రాచకొండ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శేషు రాజ్ దడ్డాల, విజయ్ పిడప సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, ఆదిత్య పాపిశెట్టి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ఉప్పుతొల్ల బాబు (బాబీ) వ్యవహరిస్తున్నారు.
Also Read
- Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
- Shahid Kapoor: ప్రభాస్ ‘కల్కి’ దెబ్బకు షాహిద్ కపూర్ ‘అశ్వద్ధామ’ ఔట్? నిర్మాత షాకింగ్ కామెంట్స్!
- Telangana: సినిమా టికెట్లపై సరికొత్త జీవో: 'స్పెషల్ థియేటర్స్' కేటగిరీ.. రోజూ 5 షోలకు గ్రీన్ సిగ్నల్!
- Toxic Ticket Prices: డబ్బింగ్ మూవీకి ఇంత రేటా? ‘టాక్సిక్’ టికెట్ ధరలపై సినీ లవర్స్ ఫైర్!
తాజావార్తలు
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్‌లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
-
Kangana Ranaut-Baba Ramdev: నా యవ్వనం గురించి మీకెందుకు బెంగ.. బాబా రామ్‌దేవ్‌పై కంగనా ఫైర్
-
School Holidays: కుక్కల బెడదతో స్కూళ్లకు సెలవులు.. 4 రోజులు ఆన్లైన్ క్లాసులే..
-
Telegram: టెలిగ్రామ్ యూజర్లకు బంపర్ ఆఫర్.. ఇక ప్రతి ఒక్కరికీ ఫ్రీ వెబ్సైట్, డొమైన్! CEO సంచలన ప్రకటన..
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!