Srisimha koduri: ‘ఉస్తాద్’గా కీరవాణి తనయుడు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘మత్తు వదలవరా, తెల్లవారితే గురువారం’ వంటి వైవిధ్యమైన చిత్రాల్లో కథానాయకుడిగా మెప్పించి తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నాడు కీరవాణి తనయుడు శ్రీసింహా కోడూరి. ఈ యంగ్ హీరో ప్రస్తుతం ‘దొంగలున్నారు జాగ్రత్త’ మూవీలో నటిస్తున్నాడు. అయితే, తాజాగా శ్రీ సింహా హీరోగా మరో సినిమా మొదలైంది. ఈ కొత్త చిత్రానికి ‘ఉస్తాద్’ అనే పేరు పెట్టారు. గురువారం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ఈ సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఎ సాయి కొర్రపాటి ప్రొడక్షన్, వారాహి చలన చిత్రం, క్రిషి ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై రజనీ కొర్రపాటి, రాకేష్ రెడ్డి గడ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి ఫణిదీప్ దర్శకత్వం వహిస్తున్నారు.
Also Read
- NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
- Jhanvi Kapoor : ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్‌ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
- PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన 'పెద్ది'
- Mega Hero : 100 కథలు రిజెక్ట్ చేసి ఎట్టకేలకు కొత్త సినిమాను లైన్ లో పెట్టిన యంగ్ హీరో

Kiravani
‘ఉస్తాద్’ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రముఖ సీనియర్ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి, శ్రీవల్లి, నిర్మాత సాయి కొర్రపాటి, కాల భైరవతో పాటు దర్శకులు వెంకటేష్ మహ, శ్రీనివాస్ గవిరెడ్డి, సినిమాటోగ్రాఫర్ వంశీ పచ్చిపులుసు తదితరులు హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి కీరవాణి క్లాప్ కొట్టగా, ప్రముఖ ఆధ్యాత్మిక రచయిత పురాణపండ శ్రీనివాస్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. న్యూ ఏజ్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్‌కు జాక్‌పాట్.. అండమాన్‌లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!