Site icon NTV Telugu

Mission Chapter 1: సంక్రాంతి బరిలో చేరిన ఇంకో సినిమా.. ?

Arun

Arun

Mission Chapter 1: వచ్చే ఏడాది సంక్రాంతి రసవత్తరంగా సాగుతోంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎప్పుడు ఉండే సంక్రాంతిలా వచ్చే యేడు ఉండదు అనిపిస్తోంది. ఒకటి కాదు రెండు కాదు దాదాపు 9 సినిమాలు ఈ సంక్రాంతికి రిలీజ్ కానున్నాయి. ఇక తాజాగా మరో సినిమా వచ్చి సంక్రాంతి లిస్ట్ లో యాడ్ అయ్యింది. అరుణ్ విజయ్, ఎమీ జాక్సన్, నిమిషా సజయన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం మిషన్ చాప్టర్ 1. టాలెంటెడ్ డైరెక్టర్ విజయ్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎం.రాజ‌శేఖ‌ర్‌, ఎస్‌.స్వాతి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ చిత్రాన్ని కేవ‌లం 70 రోజుల్లో లండ‌న్‌, చెన్నై స‌హా ప‌లు లొకేష‌న్స్‌లో శ‌ర‌వేగంగా చిత్రీక‌రించటం గొప్ప విష‌యం. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది.

2.0, పొన్నియిన్ సెల్వన్ వంటి సినిమాలను నిర్మించి అందరి మన్ననలు అందుకుని ఇప్పుడు ఇండియన్ 2, రజినీకాంత్ 170 చిత్రాలతో ఆడియెన్స్‌ని వావ్ అనిపించటానికి సిద్ధమవుతోన్న నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్. భారీ బడ్జెట్ సినిమాలనే కాదు, డిఫరెంట్ కంటెంట్ చిత్రాలను కూడా పేక్షకులకు అందించటానికి లైకా సంస్థ ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటుంది. దీంతో ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. 2.0లో న‌టించి అలరించిన ముద్దుగుమ్మ‌ ఎమీ జాక్స‌న్ మిషన్ చాప్టర్ 1 చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తుంది. ఇందులో ఆమె జైలర్ పాత్రలో మెప్పించబోతున్నారు. మ‌ల‌యాళ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన విల‌క్ష‌ణ న‌టి నిమిషా స‌జ‌య‌న్ ఈ మూవీలో ఓ కీల‌క పాత్ర‌ను పోషించారు. జి.వి.ప్ర‌కాష్ ఈ చిత్రానికి సంగీత సార‌థ్యాన్ని వ‌హిస్తున్నారు. సినిమాను నాలుగు భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Exit mobile version