‘మిస్సింగ్’ ఫేమ్ మిషా నారంగ్ కు మరో ఛాన్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు శ్రీసింహా హీరోగా నటించిన ‘తెల్లవారితే గురువారం’ చిత్రంలో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది మిషా నారంగ్. తాజాగా విడుదలైన ‘మిస్సింగ్’ సినిమాలోనూ వన్ ఆఫ్ ద హీరోయిన్స్ గా నటించింది. ఈ సినిమాతో నటిగానూ మిషాకు చక్కని గుర్తింపు లభిస్తోంది. ఇదిలా ఉంటే ఆమె నటిస్తున్న మూడో తెలుగు సినిమా రెగ్యులర్ షూటింగ్ సోమవారం మొదలైంది. ఈసారి మిషా… సీనియర్ నటుడు సాయికుమార్ తనయుడు ఆది సరసన చోటు దక్కించుకుంది.
ఆది హీరోగా శివశంకర్ దేవ్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ అజయ్ శ్రీనివాస్ ఓ క్రైమ్ మిస్టరీ థ్రిలర్ ను విజయ దశమి రోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. తాజాగా ఈ చిత్రంలో మిషాను నాయికగా ఎంపిక చేశారు. సోమవారం మూవీ రెగ్యులర్ షూటింగ్ నూ ప్రారంభించారు. హైదరాబాద్ కోకాపేట లోని ఒక ప్రైవేట్ హౌస్ లో ఆది సాయికుమార్, మిషా నారంగ్, భూపాల్ పై కొన్ని కీలక సన్నివేశాలను దర్శకుడు చిత్రీకరించాడు. కొత్త కాన్సెప్ట్, సరికొత్త కథనంతో సాగే ఈ సినిమాలో ఆది సాయికుమార్ గతంలో ఎప్పుడూ చేయని పాత్ర చేయబోతున్నారని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. అలీ రెజా, నందినీరాయ్, తాకర్ పొన్నప్ప, వాసంతి తదితరులు ప్రధాన పాత్రలు పోషించే ఈ సినిమాకు అనీష్ సోలోమాన్ సంగీతం అందిస్తున్నారు.
Also Read
- Young Heroines: హీరోయిన్ అంటే గ్లామర్ మాత్రమే కాదు.. తల్లి పాత్రలతో కొత్త రూట్లో యంగ్ హీరోయిన్లు! అసలు లెక్క ఇదే..
- Mallepoola Pallaki Song: ‘ఇరుముడి’ నుంచి ‘మల్లెపూల పల్లకి’ సాంగ్ వచ్చేసింది.. సినిమాపై అంచనాలు పెంచేసిన రవితేజ!
- Yash Reveals: రూ.4000 కోట్లు కాదట.. రామాయణ బడ్జెట్ వెనుక అసలు లెక్కలు చెప్పిన రాకింగ్ స్టార్!
- Yash Rejected 7 Films: 7 సినిమాలు వదులుకున్న యశ్.. మనీ విషయంలో రాకింగ్ స్టార్ ఫార్ములా ఇదేనట!
తాజావార్తలు
-
IMD Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రేపు ఇక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు..
-
Success Story: రూ.37 వేల జీతంతో మొదలైన ప్రయాణం..11 ఏళ్లలో రూ.2.2 కోట్లకు.. ఎలా అంటే..
-
Young Heroines: హీరోయిన్ అంటే గ్లామర్ మాత్రమే కాదు.. తల్లి పాత్రలతో కొత్త రూట్లో యంగ్ హీరోయిన్లు! అసలు లెక్క ఇదే..
-
VVS Laxman: ఎట్టకేలకు.. వీవీఎస్ లక్ష్మణ్‌కు శుభవార్త.. కీలక నిర్ణయం తీసుకున్న బీసీసీఐ..
-
West Bengal: సీజేపీ సభ్యుడి తండ్రి హత్య.. బీజేపీతో సంబంధం లేదన్న సీఎం..
ట్రెండింగ్
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్‌గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?