Site icon NTV Telugu

Mirzapur 3: “మీర్జాపూర్ – 3” రిలీజ్ డేట్ వచ్చేసింది..

Mm

Mm

Mirzapur 3 Releasing Date: ఓటీటీలో అభిమానులను ఎంతగానో అలరించిన మోస్ట్‌ పాపులర్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ వెబ్‌సిరీస్‌ల్లో ‘మీర్జాపూర్‌’ మొదటి లిస్ట్‌లో ఉంటుంది. ఈ వెబ్‌ సిరీస్‌ నుంచి ఇప్పటికే విడుదలైన రెండు భాగాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. అయితే, చాలా గ్యాప్ తర్వాత మూడో సీజన్ వస్తోంది. దీంతో ఫ్యాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు. మూడో సీజన్‌ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు మేకర్స్‌ శుభవార్త చెప్పారు. మీర్జాపూర్‌ విడదల తేదీని చెబుతూ కొత్త పోస్టర్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో OTT ప్లాట్‌ఫాం షేర్ చేసింది. జులై 5 నుంచి ఈ వెబ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్‌ అవుతున్నట్లు వారు ప్రకటించారు.

Also Read: Raju Yadav : ఓటీటీలోకి వచ్చేస్తున్న రాజు యాదవ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

గుర్మీత్‌సింగ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్‌ ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌ నేపథ్యంలో కొనసాగుతుంది. పంకజ్‌ త్రిపాఠి, శ్రియ పిల్గోంగర్‌, శ్వేతా త్రిపాఠి,అలీ ఫజల్‌, దివ్యేందు శర్మ,హర్షిత గౌర్‌ తదితరులు మొదటి భాగంలో నటించారు. రెండో సీజన్‌లో విజయవర్మ కీలకపాత్రలో కనిపించారు. 2018 నవంబరు 16న ఈ సీరిస్‌ విడుదలైంది. దానికి సీక్వెల్‌గా 2020 అక్టోబరు 23న రెండో సీజన్‌ విడుదలైంది. ఇప్పుడు సుమారు నాలుగేళ్ల తర్వాత జులై 5న మీర్జాపూర్‌-3 ప్రేక్షకుల ముందుకు రానుంది.ఏది ఏమైనప్పటికీ, మీర్జాపూర్ యొక్క కాల్పనిక ప్రపంచంలో అందరి కళ్ళు గౌరవనీయమైన సింహాసనంపై ఉన్నప్పుడు నియమాలు అలాగే ఉంటాయి.

Exit mobile version