Site icon NTV Telugu

Mirai Trailer : మిరాయ్ ట్రైలర్ రిలీజ్.. విలన్ గా మంచు మనోజ్ అదరగొట్టాడుగా

Mairai

Mairai

చైల్ట్ ఆర్టిస్టు నుండి హీరోగా మారిన తేజా సజ్జా హనుమాన్ మూవీతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాడు . జీరో ఎక్స్‌పెక్టేషన్స్‌తో వచ్చిన ఈ పాన్ ఇండియా ఫిల్మ్ రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్స్‌ సాదించి టాలీవుడ్ మాత్రమే కాదు బాలీవుడ్‌ను షేక్ చేసింది. అదే జోష్ లో మరో పాన్ ఇండియా సినిమాను లైన్ లో పెట్టాడు తేజసజ్జ. ఈగల్ ఫెమ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా చేస్తున్న మూవీ మిరాయ్. అత్యంత భారీ బడ్జెట్ పై ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.

ఇందులో తేజ ఓ యోధుడిగా కనిపించబోతున్నాడు. మంచు మనోజ్ యాంటోగనిస్టుగా కనిపించడం కూడా ఈ సినిమాకు మరింత హైప్ క్రియేట్ చేసింది. రితికా నాయక్ హీరోయిన్. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ కు మంచి స్పందన రాగా తాజాగా మిరాయ్ ట్రైలర్ ను చేసారు మేకర్స్. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు విజువల్ ఫీస్ట్ అందించిందనే చెప్పాలి. హీరోగా తేజ సజ్జా ఆకట్టుకున్నాడు. ఇక విలన్ గా మంచు మనోజ్ అయితే అదరగొట్టాడు. డీవోపీ కమ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని టేకింగ్ మేకింగ్ అదిరిపోయింది. చూస్తుంటే పాన్ ఇండియా స్థాయిలో మిరాయ్ గట్టిగా సౌండ్ చేసేలా ఉంది. ఇక ట్రైలర్ చివర్లో వచ్చిన రాముడి షాట్ ట్రైలర్ కె హైలెట్ అని చెప్పొచ్చు. జగపతి బాబు, శ్రేయ కూడా కీ రోల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ 12న పాన్ ఇండియా భాషలలో మిరాయ్ రిలీజ్ కాబోతుంది.

Exit mobile version