Mirai: కంటెంట్‌ను నమ్మాం.. రేట్లు పెంపకం కాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలెంటెడ్ హీరో తేజ సజ్జ మరో సూపర్ హీరో తరహా ప్రాజెక్ట్ ‘మిరాయ్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా పాన్ ఇండియా మాత్రమే కాదు, పాన్ వరల్డ్ వైడ్ భాషల్లో సెప్టెంబర్ 12 విడుదల కానుంది. హనుమాన్ లాంటి గ్రాండ్ సక్సెస్ తర్వాత, భారీ గ్రాఫిక్స్, డివోషనల్ టచ్‌తో ఈ సినిమా రాబోతుందనే స్పష్టత ట్రైలర్ ద్వారా అర్ధమవుతుంది. ట్రైలర్‌లో కనిపించిన యాక్షన్ సీక్వెన్స్‌లు, స్పెషల్ ఎఫెక్ట్స్, VFX ఎలిమెంట్స్ అన్ని ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.
Also Read : Kamalinee Mukherjee: టాలీవుడ్‌లో నటించకపోవడానికి కారణం ఇదే..
Also Read
- మనం రోడ్డుపై చూసి వదిలేసే 'బిచ్చగాళ్ల' వెనుక ఇంత పెద్ద కథ ఉందా..?
- SlumDog Movie Teaser: 'మా బతుకులతో ఆడుకుంటే వదలం'.. గూస్బంప్స్ తెప్పిస్తున్న పూరీ 'స్లమ్‌డాగ్' టీజర్!
- Ram Charan: ఈ సినిమాలో ఆయన నటన చూసి నాకు కంట్లో నీళ్లు వచ్చాయి: రామ్‌చరణ్
- Ravi Shankar : ఈ సినిమాను చరణ్ తన ఒంటి కాలుతో నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లారు: మైత్రీ రవిశంకర్
ముఖ్యంగా కంటెంట్, యాక్షన్ చూపించడానికి డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని చాలా జాగ్రత్తలే తీసుకున్నారు. శ్రియ కీలకపాత్రలో నటిస్తూ యాక్షన్ సీన్స్‌ను మరింత ఆకట్టుకునేలా చేశారని తెలిపారు. ఫ్యాన్స్ ఇప్పటికే ఈ చిత్రానికి ఉన్న ఆసక్తిని సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లో పలు సినిమాల కోసం టికెట్ ధరలు పెరుగుతూ వచ్చాయి. కానీ గతంలో ‘హనుమాన్’ సినిమాకు మాత్రం మేకర్స్ ఎలాంటి ధరల పెంపు లేకుండా సాధారణ రేట్లతో సినిమాను విడుదల చేసి, భారీ వసూళ్లు సాధించారు. ఇక ఇప్పుడు మిరాయ్ కూడా అదే స్ట్రాటజీతో వస్తుంది. మేకర్స్ లేటెస్ట్ ట్రైలర్ లాంచ్‌లో ఈ విషయం గురించి స్పష్టంగా చెప్పారు.. “మనం కంటెంట్‌కు ప్రాధాన్యం ఇస్తున్నాము. టికెట్ రేట్లలో ఎటువంటి పెంపు లేదు. ప్రేక్షకులు నేరుగా గొప్ప కంటెంట్‌ని అనుభవించగలరు” అని తెలిపారు. ఇలా సామాన్యుడికి కూడా మంచి కంటెంట్ అందుబాటులో పెడితే దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో హను మాన్‌తో ప్రూవ్ అయ్యింది. మరి ఇదే దారిలో మిరాయ్ కూడా వెలుతుంది. సో మిరాయ్ కి ఎలాంటి రెస్పాండ్ వస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!