Site icon NTV Telugu

Mirai: కంటెంట్‌ను నమ్మాం.. రేట్లు పెంపకం కాదు

Mirai

Mirai

టాలెంటెడ్ హీరో తేజ సజ్జ మరో సూపర్ హీరో తరహా ప్రాజెక్ట్‌ ‘మిరాయ్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా పాన్ ఇండియా మాత్రమే కాదు, పాన్ వరల్డ్ వైడ్ భాషల్లో సెప్టెంబర్ 12 విడుదల కానుంది. హనుమాన్‌ లాంటి గ్రాండ్ సక్సెస్ తర్వాత, భారీ గ్రాఫిక్స్, డివోషనల్ టచ్‌తో ఈ సినిమా రాబోతుందనే స్పష్టత ట్రైలర్ ద్వారా అర్ధమవుతుంది. ట్రైలర్‌లో కనిపించిన యాక్షన్ సీక్వెన్స్‌లు, స్పెషల్ ఎఫెక్ట్స్, VFX ఎలిమెంట్స్ అన్ని ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.

Also Read : Kamalinee Mukherjee: టాలీవుడ్‌లో నటించకపోవడానికి కారణం ఇదే..

ముఖ్యంగా కంటెంట్, యాక్షన్ చూపించడానికి డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని చాలా జాగ్రత్తలే తీసుకున్నారు. శ్రియ కీలకపాత్రలో నటిస్తూ యాక్షన్ సీన్స్‌ను మరింత ఆకట్టుకునేలా చేశారని తెలిపారు. ఫ్యాన్స్ ఇప్పటికే ఈ చిత్రానికి ఉన్న ఆసక్తిని సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లో పలు సినిమాల కోసం టికెట్ ధరలు పెరుగుతూ వచ్చాయి. కానీ గతంలో ‘హనుమాన్‌’ సినిమాకు మాత్రం మేకర్స్ ఎలాంటి ధరల పెంపు లేకుండా సాధారణ రేట్లతో సినిమాను విడుదల చేసి, భారీ వసూళ్లు సాధించారు. ఇక ఇప్పుడు మిరాయ్ కూడా అదే స్ట్రాటజీతో వస్తుంది. మేకర్స్ లేటెస్ట్ ట్రైలర్ లాంచ్‌లో ఈ విషయం గురించి స్పష్టంగా చెప్పారు.. “మనం కంటెంట్‌కు ప్రాధాన్యం ఇస్తున్నాము. టికెట్ రేట్లలో ఎటువంటి పెంపు లేదు. ప్రేక్షకులు నేరుగా గొప్ప కంటెంట్‌ని అనుభవించగలరు” అని తెలిపారు. ఇలా సామాన్యుడికి కూడా మంచి కంటెంట్ అందుబాటులో పెడితే దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో హను మాన్‌తో ప్రూవ్ అయ్యింది. మరి ఇదే దారిలో మిరాయ్ కూడా వెలుతుంది. సో మిరాయ్ కి ఎలాంటి రెస్పాండ్ వస్తుందో చూడాలి.

Exit mobile version