టోవినో థామస్ హీరోగా నటించిన సూపర్ హీరో మూవీ ‘మిన్నల్ మురళి’. జైసన్ అనే వ్యక్తి జీవిత చరిత్ర ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఓ సాధారణ వ్యక్తి నుంచి అతింద్రీయ శక్తులను సాధించిన సూపర్ హీరో (మురళి) కథే ‘మిన్నల్ మురళి’. ఈ చిత్రాన్ని సోఫియా పాల్ వీకెండ్ బ్లాక్ బస్టర్స్ బ్యానర్ మీద నిర్మిస్తుండగా, బసిలో జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక మాలీవుడ్ ఐకాన్ టోవినో థామస్ సూపర్ హీరో మిన్నల్ మురళి పాత్రను పోషిస్తున్నారు. గురు సోమసుందరం, హరిశ్రీ అశోకన్, అజు వర్గీస్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం మలయాళంలో రూపొందినప్పటికీ తెలుగు, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో డబ్ కానుంది. చెడు మీద మంచి చేసిన యుద్దాన్ని ‘మిన్నల్ మురళి’ చిత్రంలో చూడవచ్చని, క్రిస్మస్ కానుకగా దీన్ని నెట్ ఫ్లిక్స్ లో 24వ తేదీ స్ట్రీమింగ్ చేయబోతున్నామని దర్శకుడు బసిల్ జోసెఫ్ అన్నారు.
క్రిస్మస్ కానుకగా ‘మిన్నల్ మురళి’
