Site icon NTV Telugu

Bheemla Nayak: పవన్‌ కళ్యాణ్ తొలిప్రేమను నేనూ చూశాను: మంత్రి కేటీఆర్

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా మంత్రులు కేటీఆర్, తలసాని హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. నాలుగేళ్ల క్రితం యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో చిరంజీవి, రామ్‌చరణ్ పిలిచిన ఓ సినిమా ఫంక్షన్‌కు హాజరయ్యానని.. అప్పుడు మెగాస్టార్, ఆయన సోదరుడు పవర్‌స్టార్ అని మాట్లాడుతుంటే.. తనను అభిమానులు అరుపులతో మాట్లాడనివ్వలేదని.. ఇప్పుడు కూడా తనని మాట్లాడనివ్వడం లేదని కేటీఆర్ నవ్వుతూ అన్నారు. 26 ఏళ్లుగా ఒకే విధమైన స్టార్‌డమ్‌ను మెయింటెన్ చేయడం మాములు విషయం కాదన్నారు. అది పవన్ కళ్యాణ్ గారికి సాధ్యమైందని తెలిపారు. తాను కూడా కాలేజీలో ఉన్న రోజుల్లో పవన్ కళ్యాణ్ తొలిప్రేమ సినిమాను చూశానని కేటీఆర్ గుర్తుచేసుకున్నారు.

మరోవైపు గత 8 ఏళ్లుగా కేవలం తెలుగు పరిశ్రమ కోసమే కాకుండా భారతదేశ చలనచిత్ర పరిశ్రమకు హైదరాబాద్ సినీ హబ్‌గా మారిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. సినిమా ఇండస్ట్రీ కోసం తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి సహకారాన్ని అయినా అందిస్తుందన్నారు. ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి టెక్నీషియన్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

https://www.youtube.com/watch?v=v97rAjyN_hQ
Exit mobile version