Site icon NTV Telugu

అందాల దేవత.. అరిటాకు భోజనం ఆరగిస్తుంది ఇలా!

tamannaah

tamannaah

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. ప్రస్తుతం ఆమె ‘ఎఫ్3’ షూటింగ్ ని పూర్తిచేస్తూనే చిరు సరసన ‘బోళా శంకర్’ చిత్రంలో నటిస్తుంది. ఇక సినిమాలు కాకుండా అమ్మడు ప్రకటనలు చేస్తూ రెండు చేతులా సంపాదిస్తుంది. తాజాగా ఒక యాడ్ షూట్ బ్రేకులో మిల్కీ బ్యూటీ ఇదిగో ఇలా దేవతా రూపంలో ప్రత్యక్షమైంది.

ఒంటి నిండా ఆభరణాలు, తలపై కీరిటం పెట్టుకొని భారతీయ సాంప్రదాయం ప్రకారం అరిటాకులో భోజనం చేస్తూ కనిపించింది. అరిటాకు ముందు అమ్మడు ఎంతో ఓపిగా కూర్చొని తెలుగు వంటకాలను రుచి చూసింది. ఆ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ.. “అరిటాకు ముందు కూర్చొని తిన్న ప్రతిసారి నేను దేవతలా ఫీల్ అవుతాను” అంటూ చెప్పుకొచ్చింది. నిజం చెప్పాలంటే.. బ్లాక్ చీరలో ఆ ఆభరణాలతో తమన్నా నిజంగా అందాల దేవతను గుర్తుచేస్తుంది అంటున్నారు అభిమానులు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

https://www.instagram.com/p/CWpsl3DPfID/

Exit mobile version