KGF Chapter 2 టీం ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ తో ప్రమోషన్లు స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. యావత్ దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ చిత్రం “కేజీఎఫ్ : చాప్టర్ 2”. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యష్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. యష్ అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఈ సినిమా గురించి ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. పలు వాయిదాల అనంతరం ఎట్టకేలకు ఈ చిత్రం ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఇక ప్రేక్షకులను ఆనందాశ్చర్యాల్లో ముంచెత్తడానికి ‘కేజీఎఫ్2’ మేకర్స్ రెడీ అవుతున్నారు. మార్చి 30న కొత్త టెక్నాలజీతో సినీ అభిమానులను అలరించడానికి ‘కేజీఎఫ్2’ టీమ్ సిద్ధమైంది.
Read Also : Manchu Manoj : షాక్ ఇచ్చిన ట్రాఫిక్ పోలీసులు… జరిమానా
ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల సరికొత్త ప్లాన్ మెటావర్స్. సినిమా రంగంలో రోజురోజుకూ పుట్టుకొస్తున్న సరికొత్త సాంకేతిక ప్రేక్షకులను తమ ప్రపంచంలోకి తీసుకెళ్లడానికి మేకర్స్ కృషి చేస్తున్నారు. ఇప్పటికే మెటావర్స్ ను ఉపయోగించి “రాధేశ్యామ్” అభిమానులను మైమరపించాడు. ఇప్పుడు మెటావర్స్ ను ”కేజీఎఫ్ వర్స్”గా మార్చి రాఖీ భాయ్ ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్ళబోతున్నారు. ఏప్రిల్ 7న ”కేజీఎఫ్ వర్స్”ను లైవ్ చేయబోతున్నారు మేకర్స్. సో గెట్ రెడీ రాఖి భాయ్ ఫ్యాన్స్ సరికొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టడానికి !
హోంబలే పిక్చర్స్ బ్యానర్ పై భారీ స్థాయిలో నిర్మించిన “కేజీఎఫ్ : చాప్టర్ 2” చిత్రానికి ట్యాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తుండగా, యష్, శ్రీనిధి శెట్టి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. సంజయ్ దత్, రవీనా టాండన్, రావు రమేష్, ప్రకాష్ రాజ్, ఇతరులు ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ ఈ బహుభాషా చిత్రానికి సంగీతం అందించారు.
