Meher Ramesh: పరశురామ్ క్లారిటీతో సినిమా తీశాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహేశ్ బాబు, పరశురామ్ కాంబోలో రూపొందిన ‘సర్కారు వారి పాట’ మే 12వ తేదీన విడుదల అయ్యేందుకు ముస్తాబవుతోన్న విషయం తెలిసిందే! ఈ సందర్భంగానే చిత్రబృందం హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ ఈవెంట్‌కి పలువురు దర్శకులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. మహేశ్‌కి అత్యంత సన్నిహితుడైన మెహర్ రమేశ్ కూడా వచ్చాడు. ఈ నేపథ్యంలోనే ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
మహేశ్‌ని ద బెస్ట్ వేలో పూరీ జగన్నాథ్ ‘పోకిరి’ సినిమాలో చూపించాడని, ఇప్పుడు అదే విధంగా పరశురామ్ ఈ సినిమాని తెరకెక్కించాడని మెహర్ చెప్పాడు. పూరీకి పరశురామ్ కజిన్ అవుతాడని, తొలుత తాను పూరీ వద్ద పని చేశానని, ఆ తర్వాత పరశురామ్ పూరీ దగ్గర పని చేశాడన్నాడు. మహేశ్‌ని ఎలా ప్రెజెంట్ చేయాలో.. అలాగే ఈ సినిమాలో చూపించాడని, చాలా క్లారిటీతో ‘సర్కారు వారి పాట’ తెరకెక్కించాడన్నాడు. ఎంత ఎంటర్టైన్ చేయాలో, అంత బాగా చేశాడన్నాడు. పాటలు, ఫైట్స్ (ట్రైలర్‌లో) ఎంతో బాగున్నాయని.. మీతో (ప్రేక్షకుల్ని ఉద్దేశించి) పాటు మేము కూడా అవి చూశామని, ఈ సినిమా కచ్ఛితంగా బ్లాక్‌బస్టర్ అవుతుందని నమ్మకం వెలిబుచ్చాడు.
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
సావిత్రి పాత్ర పోషించి, మహానటిగా ఎదిగిన జాతీయ పురస్కార గ్రహీత కీర్తి సురేశ్‌లో పరశురామ్ ఓ అల్లరి అమ్మాయిని చూశాడని, ఇందులో ఆమె చాలా మాసీగా కనిపిస్తోందన్నాడు. తన సినిమాలో (భోళాశంకర్) సిస్టర్ పాత్రలో చేస్తోన్న కీర్తి, దానికి పూర్తి విరుద్ధంగా ఈ సినిమాలో నటించిందన్నాడు. ఇక మహేశ్ బాబు గ్లామర్ & గ్రేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని, ఇందులో మరింత అదరగొట్టాడని కొనియాడాడు. ఈ సినిమా ఘనవిజయం సాధించడం పక్కా అంటూ తన ప్రసంగాన్ని ముగించాడు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!