Megastar who introduced Roopa!
బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ ఆమీర్ ఖాన్ తాజా చిత్రం ‘లాల్ సింగ్ చడ్డా’. హిందీలో రూపుదిద్దుకున్న ఈ సినిమాను తమిళ, తెలుగు భాషల్లోనూ అనువదించి విడుదల చేస్తున్నారు. కాగా ఇటీవల ఈ సినిమాను ప్రత్యేకంగా వీక్షించిన అనంతరం చిరంజీవి తెలుగు వర్షన్ కు తాను సమర్పకుడిగా వ్యవహరించబోతున్నట్టు ప్రకటించారు. అంతేకాదు. ఆ సినిమా తెలుగు వర్షన్ ప్రమోషన్స్ మీద కూడా చిరంజీవి దృష్టి పెట్టారు. తాజాగా ఆయన తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ‘లాల్ సింగ్ చడ్డా’లోని కథానాయిక కరీనా కపూర్ పాత్రను పరిచయం చేశారు. ” ‘లాల్ సింగ్ చడ్డా’ ప్రేయసి ‘రూప’ని మీకు పరిచయం చేస్తున్నాను… వీళ్లిద్దరి బంధం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ‘ముద్దపప్పు-ఆవకాయ’.” అంటూ ఆయన పేర్కొన్నారు. ‘లాల్ సింగ్ చడ్డా’ మూవీతో నాగార్జున తనయుడు నాగచైతన్య బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమా ఆగస్ట్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.
‘లాల్ సింగ్ చడ్డా’ ప్రేయసి ‘రూప’ని మీకు పరిచయం చేస్తున్నాను…వీళ్లిద్దరి బంధం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ‘ముద్దపప్పు-ఆవకాయ’.
Introducing Rupa from #LaalSinghChaddha #Rupa #KareenaKapoorKhan #AamirKhan @AKPPL_Official @Viacom18Studios @chay_akkineni #11August22Release pic.twitter.com/fcKUJ4QTy3
— Chiranjeevi Konidela (@KChiruTweets) July 18, 2022