Site icon NTV Telugu

Chiranjeevi: హిట్ పడడం ఆలస్యం.. మెగాస్టార్ లాగేస్తున్నాడు..?

Chiru

Chiru

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి.. ఈ వయస్సులో కూడా వరుస సినిమాలను లైన్లో పెట్టి కుర్రహీరోలకు చెమటలు పట్టిస్తున్నాడు. ఒక సినిమా రిలీజ్ అవ్వకముందే రెండు మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు. ముఖ్యంగా ఇండస్ట్రీలో హిట్ కొట్టిన డైరెక్టర్లలను అయితే చిరు అస్సలు వదలడం లేదు. ఇప్పటికే బింబిసార తో హిట్ అందుకున్న వశిష్ఠ తో ఒక సినిమా , బంగార్రాజు సినిమాతో హిట్ అందుకున్న కళ్యాణ్ కృష్ణ తో ఒక సినిమా చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమాల అధికార ప్రకటనలు కూడా రానున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే చిరు మరో హిట్ డైరెక్టర్ ను లాగేశాడని టాక్ నడుస్తోంది. ఈ ఏడాది బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఒకటిగా నిలిచిన 2018 డైరెక్టర్ జూడ్ అంటోనీ జోసెఫ్ తో చిరు ఒక సినిమా చేయబోతున్నాడంటూ ఒక వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

Neena Gupta: పిల్లలకు బూతు పదాలు, శృంగారం నేర్పించాలి.. అది అవసరం

మలయాళంలో ఈ సినిమా ఎన్ని రికార్డులు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ చిత్రాన్ని తెలుగు లో గీతా ఆర్ట్స్ డబ్బింగ్ చేసి రిలీజ్ చేసింది. ఇక్కడ కూడా విజయ ఢంకా మోగించింది. ఇక అందుతున్న సమాచారం ప్రకారం జూడ్ తో మెగాస్టార్ ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నారట. ఆ సినిమా వైజాగ్ నేపథ్యంలో ఉండనున్నట్లు టాక్ నడుస్తోంది. సముద్రపు బ్యాక్ డ్రాప్ లోనే ఈ సినిమా నడుస్తుందని, ఆ కథ చిరుకు నచ్చడంతో ఆయనను లాక్ చేసినట్లు సమాచారం. ఇక ఈ సినిమాను గీత ఆర్ట్స్ నిర్మిస్తుందని అంటున్నారు. ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. ఏదిఏమైనా బాస్ అనుకుంటే.. డైరెక్టర్లకు కొదువా.. మరి ఈ సినిమాలతో చిరు ఎలాంటి రికార్డులు సృష్టిస్థాయి చూడాలి.

Exit mobile version