కుర్ర హీరోలకు ఈ మాత్రం తగ్గకుండా మెగాస్టర్ చిరంజీవి వరుస సినిమాలను లైన్లో పెట్టి షూటింగ్ మొదలుపెట్టేస్తున్నారు. ఇప్పటికే ఆచార్య విడుదలకు సిద్దంకాగా, ‘గాడ్ ఫాదర్’, బోళా శంకర్ పూజ కార్యక్రమాలను పూర్తిచేసుకొని షూటింగ్ కి రెడీ అవుతున్నాయి. ఇక వీటితో పాటు యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో మెగా 154 చిత్రంలో నటిస్తున్నాడు. ఇప్పటికే పూజా కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈరోజు షూటింగ్ మొదలుపెట్టింది.
మొదటి రోజు చిరుతో షూటింగ్ అనుభవాన్ని దర్శకుడు బాబీ ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు మెగాస్టార్ కి సీన్ వివరిస్తూ ఉన్న ఫోటోని షేర్ చేస్తూ ” ఈరోజు నాకు చాలా థ్రిల్లింగ్ గా ఉంది. ఒకేసారి ఉత్సాహం, ఉద్వేగం తన్నుకొస్తున్నాయి.. మొదటి రోజు షూటింగ్ లో చిరంజీవి గారితో.. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఈ కొత్త ప్రయాణం హక్కులా గొప్పగా ప్రారంభమైంది.. మీ అందరి ఆశీస్సులు కావాలి” అంటూ బాబీ ట్వీట్ చేశాడు. ఇక ఫొటోలో చిరు ఫేస్ కనిపించకపోవడంతో చిరు అభిమానులు కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏం మొదటిరోజే మాస్ లుక్ లో చిరు కనిపించాడని తెలియడంతో మాస్ మెగా మ్యానియా త్వరలోనే మొదలుకానున్నదని అభిమానులు పండగ చేసుకుంటుంన్నారు.
