Site icon NTV Telugu

Chiru: మెగాస్టార్ కి ఒటీటీ ఆఫర్? నో చెప్పడానికి కారణం అతనేనా?

Chiru

Chiru

సీనియర్ హీరో వెంకటేష్ చేసిన పనికి మెగాస్టార్ చిరంజీవి సైతం వెనకడుగు వేసినట్టే కనిపిస్తోంది. ఇప్పటి వరకు వెంకటేష్‌ను ఫ్యామిలీ హీరోగానే చూశాం కానీ ఓటిటి కోసం చేసిన రానా నాయుడు వెబ్ సిరీస్ మాత్రం వెంకీ ఇమేజ్ మొత్తాన్ని డ్యామేజ్ చేసేసింది. అసలు ఓటిటి కంటెంట్ అంటేనే సెన్సార్ కట్స్ లేకుండా ఉంటుంది. వల్గారిటీ లేకుండా ఓటిటిలో వచ్చే వెబ్ సిరీస్‌లను వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. ఈ జాబితాలోనే రానా నాయుడు కూడా చేరిపోయింది. రానాతో కలిసి వెంకీ చేసిన ఈ వెబ్ సిరీస్ కి నెగటివ్ రివ్యూలు వచ్చాయి. అసలు వెంకీ ఈ ప్రాజెక్ట్‌ ఎందుకు ఓకే చేశాడనేది ఎవరికీ అర్థంకాని విషయం. తెలుగు ఆడియన్స్ మాత్రమే నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు, అది కూడా వెంకటేష్ ఉన్నాడు కాబట్టే అంతే కానీ నార్త్ లో మాత్రం రానా నాయుడుకి మంచి వ్యూవర్షిప్ వచ్చింది. ఇందుకే సీరీస్ కి సెకండ్ సీజన్ ని కూడా అనౌన్స్ చేశారు.

కారణాలు ఏమైనా తెలుగు రాష్ట్రాల్లో రానా నాయుడుకి మాత్రం వెంకీ ఇమేజ్ కి గట్టి దెబ్బేసింది. అందుకే ఇప్పుడు వెబ్ సిరీస్‌లు అంటేనే మన హీరోలు భయపడిపోతున్నారు. లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి కూడా ఓ భారీ ఓటిటి ఆఫర్‌ను రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. గతంలో పలు సందర్భాల్లో మంచి కంటెంట్ దొరికితే వెబ్ సిరీస్‌ చేసేందుకు రెడీ అని చెప్పారు చిరంజీవి. ఇప్పుడు మాత్రం ఓ బడా సంస్థ చిరుతో వెబ్ సిరీస్ కోసం అప్రోచ్ అవగా, రానా నాయుడు రిజల్ట్ వలన నో చెప్పేశాడట. రానా నాయుడు సీరీస్ హిట్ అయి ఉంటే చిరుని కూడా ఒటీటీలో మంచి డెబ్యు ఇచ్చే వాడేమో.

Exit mobile version