Megastar Chiranjeevi: మూడున్నర దశాబ్దాలుగా టాలీవుడ్ లో టాప్ హీరోగా కొనసాగుతున్న హీరో చిరంజీవి. మెగాస్టార్‌గా ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న చిరుని నేషనల్ మీడియా ఒకానొక టైంలో ‘బిగ్గర్ దెన్ బచ్చన్’ అంటూ ఎలివేషన్స్ ఇచ్చిదంటే ఆయన రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా టాప్ చైర్ చేరుకున్న చిరు సినీ ప్రయాణం అందరికీ స్ఫూర్తినిచ్చేదే. ఎన్నో అవార్డులని అందుకున్న చిరు చరిత్రలో కొత్తగా చేరిన పురస్కారం ‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ 2022’. గోవాలో జరుగుతున్న ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా'(IFFI)లో ఈ అరుదైన గౌరవాన్ని అందుకోవడానికి చిరు తన భార్య సురేఖతో కలిసి స్పెషల్ ఫ్లైట్‌లో గోవా చేరుకున్నారు.
ఒకప్పుడు ఏ గోవా ఫిల్మ్ ఫెస్టివల్ లో తెలుగు హీరోలకి, తెలుగు సినిమాలకి సరైన గుర్తింపు లేదని చిరు చెప్పాడో… అదే ఫిల్మ్ ఫెస్టివల్ లో ‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ 2022’ పురస్కారం అందుకోవడం తెలుగు సినిమాకే గర్వకారణం. ఇదే గోవా ఫిల్మ్ ఫెస్టివల్‌లో బాలకృష్ణ నటించిన ‘అఖండ’, అడవి శేష్ నటించిన ‘మేజర్’ సినిమాలతో పాటు ‘సినిమా బండి’, ‘ఖుదీరాం బోస్’ మూవీస్ ‘పనోరమా’ కేటగిరిలో స్పెషల్ స్క్రీనింగ్ అయ్యాయి.
