Site icon NTV Telugu

Chiranjeevi and NTR : ‘జేమ్స్’ కోసం ఒకే ఫ్రేమ్ లో ?

Ntr-and-Chiranjeevi

గత ఏడాది కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఆకస్మిక మరణం యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఒక స్టార్ గా ఎదిగినప్పటికీ ఆయన ఒదిగి ఉండే మనస్తత్వం పునీత్ కు అశేషాభిమానాన్ని సంపాదించి పెట్టింది. కాగా పునీత్ చివరి చిత్రం “జేమ్స్” మార్చి 17న ఆయన జయంతి సందర్భంగా పెద్ద సంఖ్యలో థియేటర్లలో విడుదలవుతోంది. టాలీవుడ్ నటులలో ఎన్టీఆర్, పునీత్‌ కు మంచి అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అప్‌డేట్ ప్రకారం పునీత్ కోసం వీరిద్దరూ ఒకే ఫ్రేమ్ లో కన్పించబోతున్నారట. అయితే అది సినిమాలో కాదు ‘జేమ్స్’ వేడుకకు సంబంధించిన వేదిక పైన.

Read Also : Chinmayi : రజినీ, కమల్ లపై కామెంట్స్… ముఖ్యమంత్రులనూ వదల్లేదుగా…!!

“జేమ్స్” ప్రీ-రిలీజ్ ఈవెంట్ మార్చి 6న కర్ణాటకలోని హోస్పేట్‌లో గ్రాండ్‌గా జరగనుంది. ఈ వేడుకకు టాలీవుడ్ నుండి ప్రత్యేక అతిధులుగా మెగాస్టార్ చిరంజీవి, ఎన్టీఆర్ హాజరుకానున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది. ‘జేమ్స్’ చిత్రానికి చేతన్ కుమార్ దర్శకత్వం వహించగా, ప్రియా ఆనంద్, శ్రీకాంత్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. కర్ణాటకలోని ఎగ్జిబిటర్లు రాష్ట్రంలో జేమ్స్ మినహా మరే సినిమాను ఒక వారం పాటు ప్రదర్శించకూడదని నిర్ణయించారు. కిషోర్ పత్తికొండ ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘జేమ్స్’ హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలలో విడుదల కానుంది.

Exit mobile version